Rahul targets PM over release of Bilkis Bano gangrape convicts రేపిస్టుల విడుదలపై కేంద్రాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్.!

Rahul gandhi questions modi sarkar over release of bilkis bano s rapists says nation is watching

Rahul Gandhi slams PM Modi, Priyanka Gandhi on Bilkis bano, KTR tweet, Bikis Banu case update, Gujarat government remission policy, Bilkis Bando gangrape, Bilkis Bano murder case, Rahul Gandhi, Priyanka Gandhi, Bilkis bano, PM Modi, Bikis Banu case update, remission policy, Gujarat government, Gujarat, Crime

Hours after the rapists of Bilkis Bano walked out of the Godhra sub-jail under the Gujarat government's remission policy, Congress leader Rahul Gandhi, addressing PM Modi, said the whole country was watching the difference between what he said and what he did. Eleven accused sentenced to a lifetime in jail for the 2002 post-Godhra Bilkis Bano gang rape and murder of seven members of her family walked out of Godhra sub-jail on Monday after the Gujarat government allowed their release under its remission policy.

స్వతంత్ర్య వజ్రోత్సవ వేళ.. రేపిస్టుల విడుద‌ల‌.? మోడీపై కాంగ్రెస్ ఫైర్‌

Posted: 08/17/2022 05:01 PM IST
Rahul gandhi questions modi sarkar over release of bilkis bano s rapists says nation is watching

స్వాతంత్ర్య వ‌జ్రోత్స‌వ వేడుక‌ల వేళ.. ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా చేసిన ప్రసంగానికి ఆ మరుసటి రోజున.. బీజేపి పాలిత రాష్ట్రంలోనే తూట్లు పోడిచారు. ప్రధాని మోడీ సోంత రాష్ట్రం గుజరాత్ లో జరుగుతున్న పరిణామాలు.. ఆయన మాటలకు ఏ మాత్రం పొంతన లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని పెదాలు ఒకటి మాట్లాడితే.. ఆయన కళ్లు మాత్రం అందుకు భిన్నమైన అదేశాలను జారీచేస్తాయని విమర్శలు వినిపిస్తున్నాయి. యావత్ దేశం ఇంకా స్వతంత్య దినోత్సవ వేడుకలను అస్వాధిస్తున్న నేప‌ధ్యంలో గుజ‌రాత్ ప్ర‌భుత్వం సహా ప్రధాని మోడీపై విమర్శల జడివానకు కారణమేంటీ.?.

స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల్లో మ‌హిళ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇచ్చిన ఉప‌న్యాసానికి ఆయ‌న చేస్తున్న దానికి పొంత‌న లేద‌ని యావ‌త్ దేశం గ‌మ‌నిస్తోంద‌ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ః గాంధీ దుయ్య‌బ‌ట్టారు. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన బిల్కిస్ బానో రేపిస్టుల‌ను జైలు నుంచి విడుద‌ల చేయడం యావత్ దేశం గమనిస్తోందని ఆయన ప‌ట్ల విమ‌ర్శ‌ించారు. 2002లో గుజ‌రాత్ అల్ల‌ర్ల స‌మ‌యంలో బిల్కిస్ బానో అనే మ‌హిళ‌పై గ్యాంగ్ రేప్ జ‌రిగింది. అయిదు నెల‌ల ప్రెగ్నెంట్ మ‌హిళ‌ను దాహోద్ జిల్లాలో అత్యాచారం చేశారు. ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హ‌త‌మార్చారు.

గోద్రా ఘటన అనంతరం చెలరేగిన హింసాత్మక ఘ‌ట‌న‌లో ఐదు నెలల గర్భణీ మహిళపై అత్యంత పాశవికంగా దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో దోషులుగా తేలిన 11 మందికి 14 ఏళ్ల జైలుశిక్ష ప‌డింది. కాగా, మహిళలను గౌరవించాలని, సమాజంలో వారి సముచిత స్థానం వారికి కేటాయించి.. వారు స్వేచ్ఛావాయువల మధ్య నిర్భయంగా జీవించేందుకు ప్రతీ ఒక్కరూ ప్రతీనబూనాలని చెప్పారు. ఇక మరోవైపు దేశ స్వాతంత్య్ర దినోత్స‌వం నేప‌థ్యంలో ఆ రేపిస్టుల‌ను గుజ‌రాత్ ప్ర‌భుత్వం గోద్రా స‌బ్‌జైలు నుంచి విడుద‌ల చేయడంపై రాహుల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఎర్ర‌కోట నుంచి ప్ర‌ధాని చేసిన ప్ర‌సంగంలో మ‌హిళ‌ల‌ను చూసే దృక్కోణం మారాల‌ని, వారిని గౌర‌వించాల‌ని దేశ ప్ర‌జ‌ల‌ను కోరారు. అయితే రేపిస్టుల‌ను విడుద‌ల చేస్తూ ఆయ‌న చేత‌ల్లో అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించార‌ని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మ‌రోవైపు బిల్కిస్ బానో కేసులో దోషుల‌ను విడుదల చేయ‌డం ప‌ట్ల కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విస్మ‌యం వ్య‌క్తం చేశారు. గ‌ర్భిణిపై సామూహిక లైంగిక దాడి, హ‌త్య‌కు పాల్ప‌డి అన్ని కోర్టుల్లో దోషులుగా తేలిన‌వారిని విడుద‌ల చేయడం అన్యాయానికి ప‌రాకాష్ట కాదా అని ఆమె ప్ర‌శ్నించారు. మ‌హిళల‌ను గౌర‌వించ‌డం ప్ర‌సంగాల‌కే ప‌రిమిత‌మా అని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని ఆమె నిల‌దీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh