కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కరోనా మహమ్మారికి మునుపటి స్థితికి చేరుకుని ఇప్పుడిప్పుడే భక్తులకు ఆలవాలంగా మారుతోంది. ఈ తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుని ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ త్వరలోనే విడుదల చేయనుంది. ఈ మేరకు గురువారం ఉదయం 9 గంటలకు టికెట్లు రిలీజ్ చేయనున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. అక్టోబరు నెలకు సంబంధించిన టిక్కెట్లను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించే రూ.300 టికెట్లను వివిధ స్లాట్లలో ఇవ్వనున్నారు.
కాగా.. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని రకాల దర్శనాలు రద్దు చేసింది. కేవలం సర్వదర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఈ క్రమంలో భక్తులు ఆయా తేదీలను చూసుకొని, టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. వరస సెలవు రోజులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ఒకానొక సమయంలో శ్రీవారి సర్వదర్శనానికి 40 గంటల సమయం పట్టింది. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారికి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కిలోమీటర్ల మేర విస్తరించిన క్యూ లైన్లలోని భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్నప్రసాదాలు అందించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 21 వరకు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. తిరుమలకు భక్తులు పోటెత్తడంతో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తులు ముందస్తు ప్రణాళికతో బస, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని తిరుమలకు రావాలని విజ్ఞప్తి చేశారు. అధిక రద్దీ కారణంగా వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు యాత్ర వాయిదా వేసుకోవాలని సూచించారు. తమిళులకు పవిత్రమైన పెరటాసి మాసం సెప్టెంబరు 18న ప్రారంభమై అక్టోబరు 17న ముగుస్తుంది. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more