Avoid large gatherings during I-Day Celebrations: Centre పంద్రాగస్టున అప్రమత్తం: ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం

Govt asks states uts to avoid large gatherings during independence day celebrations

Independence Day, Independence Day 2022, Azadi Ka Amrit Mahotsav, har ghar tiranga, covid, COVID-19 cases, COVID-19 cases in India, Independence Day, Independence Day gathering, avoid Independence Day gathering

The Narendra Modi-led government at the Centre on Friday urged states to ensure that no large gatherings are being organised for Independence Day celebrations as COVID cases surged across the country. The Union Home Ministry has also conveyed to all states and union territories that COVID guidelines are strictly followed as the country continues to record an average of over 15,000 coronavirus cases daily.

పంద్రాగస్టున అప్రమత్తం: ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం

Posted: 08/12/2022 03:39 PM IST
Govt asks states uts to avoid large gatherings during independence day celebrations

భారతదేశ 75 ఏళ్ల వజ్రోత్సవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్న క్రమంలో కేంద్రప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. 75 ఏళ్ల స్వతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న అజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది కేంద్రం. ఇక ఇందులో భాగంగా దేశంలోని ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని కేంద్ర ప్రభుత్వ 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల్లో జాతీయ జెండాలను ప్రజలకు పంపిణీ చేస్తుంది.

మరో మూడు రోజుల్లో రానున్న స్వాతంత్ర దినోత్సవాన్ని అట్టహాసంగా పురస్కరించుకునేందుకు ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఆగస్టు 15న అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఇచ్చింది. ఎక్కువమంది ఒకేచోట గుమికూడద్దని ప్రజలకు తెలిపింది. అయితే దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోందని, కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. స్వాతంత్ర్య వజ్రోత్సవాల వేడుకల నేపథ్యంలో కరోనా మహమ్మారి విజృంభనపై అవగాహనతో మెలగాలని సూచించింది.

ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఏ 2.75 ఇప్పటికే భయపడటంతో పాటు ఢిల్లీ సహా పలు రాష్ట్రాలలో విజృంభిస్తోంది. ఈక్రమంలో వస్తున్న స్వతంత్ర్య దినోత్సవ వేడుకలలో ప్రజలందరూ ముందస్తు జాగ్రత్తలు, కరోనా నియంత్రణ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఇక ఈ వేడుకలలో భాగంగా అత్యధిక సంఖ్యలో ప్రజలు ఒకే చోట గుమికూడటం మంచిది కాదు. ప్రతి ఒక్కరూ ఆగస్టు 15న కరోనా నిబంధనలను తూచా తప్పకుండా పాటించండి. ఎక్కువ మంది ఒకే ప్రదేశంలో గుమిగూడకుండా ఉండేలా జాగ్రత్త పడండి' అని ప్రజలను కోరింది.

ఇదిలా ఉంటే ఇండియా గత 24 గంటల్లో 16,561 కొత్త కరోనా కేసులను నమోదు చేసింది. వీటితో దేశంలోని మొత్తం కరోనా కేసులు 4,42,23,557కు చేరుకున్నాయి. వాటిలో 1,23,535 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో పాటుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా శాఖలు స్వాతంత్ర దినోత్సవం నాడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, వాతావరణానికి మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన సమావేశాలు నిర్వహించాలని కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles