RBI tightens scrutiny over digital lending apps లోన్ యాప్ లకు రుణ నిబంధనలు విధించిన ఆర్బీఐ

Rbi tightens digital lending norms to prevent charging of exorbitant rates

RBI, Digital Lending Applications (DLAs), digital lending apps, RBI digital lending apps, RBI digital lenders, RBI guidelines, RBI guidelines on digital lending apps, RBI guidelines on digital lenders, impact of RBI guidelines on digital lending apps, impact of RBI guidelines on digital lenders, Digital lending, rbi, RBI Digital lending, RBI guidelines, breaching of data, Fintech, foreign, monetary policy, indian trade

Unregulated loan apps can no longer harass borrowers to make payments as the long-awaited and much-needed regulatory framework for digital lending has been released by the Reserve Bank of India which addresses concerns relating to engagement of third parties, mis-selling, breach of data privacy, charging of exorbitant interest rates, and unethical recovery practices.

లోన్ యాప్ లకు రుణ నిబంధనలు విధించిన భారత రిజర్వు బ్యాంకు

Posted: 08/10/2022 09:15 PM IST
Rbi tightens digital lending norms to prevent charging of exorbitant rates

లోన్ యాప్ ల ఆడగాల శృతిమించుతున్నాయి. చిటికలో రుణాలు ఇస్తామని చెప్పి.. తప్పనిసరి పరిస్థితుల్లో రుణాలను పొందిన రుణగ్రస్థుల నుంచి ముక్కుపిండి మరీ వడ్డీలతో పాటు రుణాలను తిరిగిపోందుతున్న డిజిటల్ యాప్ లపై ఎట్టకేలకు ఆర్బీఐ కోరడా జుళిపించింది. రుణగ్రస్తులకు రుణాలు ఇచ్చేందుకు వారి మొబైల్ ఫోన్ లోని వాట్సాఫ్, కాంట్రాక్టు జాబితాల అనుమతిని బలవంతంగా తీసుకుని ఒకవేళ వారు రుణాలు తిరిగి సకాలంలో చెల్లించని పక్షంలో వారి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా చర్యలకు పాల్పడుతున్నాయి.

వీటి ఆగడాలు ఎంతలా ఉన్నాయంటే.. ఏకంగా బ్యాంకు ఉద్యోగినే ఆత్మహత్యకు ప్రేరేపించే స్థాయిలో ఉన్నాయంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక ఒకటి, రెండు నుంచి ఏకంగా పదుల సంఖ్యలో వచ్చిన డిజిటల్ యాప్ లు ప్రస్తుతం వందకు పైగా చలామణిలో ఉన్నాయి. విస్తృతం కాగా, అదే సమయంలో పలు యాప్ ల నిర్వాహకులు రుణగ్రస్తుల పట్ల వ్యవహరిస్తున్న తీరు దిగ్భ్రాంతిని కలిగించేలా ఉంది. రుణగ్రస్తులపై వ్యక్తగత ప్రతిష్టకు భంగం కలిగేలా వారి పరువు మర్యాదాలపై రుణసంస్థలు దాడి చేస్తున్నాయి. బెంగళూరులో ఓ బ్యాంకు ఉద్యోగి, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగిని ఇలా దేశవ్యాప్తంగా అనేక మరణాలకు వీరు కారణం అవుతున్నారు.

ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ స్పందించింది. దేశంలో డిజిటల్ విధానంలో రుణాల మంజూరు క్రమానుగతంగా వృద్ధి చెందుతుందన్న నేపథ్యంలో, వివిధ వర్గాల్లో పెరుగుతున్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేసినట్టు ఆర్బీఐ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో ఉన్న సంస్థలు, లేక అనుమతి పొందిన మరేవైనా ఆర్థిక సంస్థల అధీనంలోని సంస్థలను ఆధారంగా చేసుకుని ఈ నియంత్రణ వ్యవస్థకు రూపకల్పనం చేయడం జరిగిందని ఆర్బీఐ ఒక నోటిఫికేషన్ లో వివరించింది. డిజిటల్ విధానంలో అప్పులు ఇచ్చే సంస్థలను మూడు కేటగిరీలుగా విభజిస్తున్నట్టు ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది.

అవి 1.) ఆర్బీఐ అనుమతి పొంది రుణ మంజూరు వ్యాపారం చేసే సంస్థలు. 2) ఆర్బీఐ నియంత్రణలో లేని... ఇతర చట్టబద్ధమైన, నియంత్రణ నిబంధనలకు లోబడి నడుచుకునే రుణ సంస్థలు. 3) ఎలాంటి చట్టబద్ధత లేని, నియంత్రణ నిబంధనలకు లోబడని సంస్థలుగా విభజించింది.కొత్త నిబంధనల ప్రకారం... అన్ని రుణ పంపిణీలు, తిరిగి చెల్లింపులు రుణ గ్రహీత, ఆర్థిక సంస్థ బ్యాంకు ఖాతాల మధ్యనే జరగాలని, ఇందులో మూడవ పక్షానికి తావు ఉండరాదని ఆర్బీఐ పేర్కొంది. అంతేకాదు, రుణ సంస్థకు చెల్లించే ఫీజు, చార్జీలు ఇతరత్రా నేరుగా నియంత్రణ వ్యవస్థ ద్వారానే చెల్లించబడతాయి. ఇందులో రుణ గ్రహీతపై భారం ఉండదు.

అంతేకాదు, రుణ పరిమితిపై రుణ గ్రహీతల అనుమతి లేకుండా ఆటోమేటిక్ పెంపుదలను ఈ నిబంధనలు నిరోధిస్తాయి. ఇక, వినియోగదారుల ఫిర్యాదులను నియంత్రణ వ్యవస్థలు 30 రోజుల్లోగా పరిష్కరించకపోతే, సదరు రుణ గ్రహీత రిజర్వ్ బ్యాంక్-ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్ మన్ స్కీమ్ కింద ఫిర్యాదు చేయవచ్చు. ముఖ్యంగా, లోన్ యాప్ లు రుణగ్రహీత అనుమతి లేకుండా అతడి డేటా సేకరించరాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అంతేకాదు, తన సమాచారాన్ని సేకరించేందుకు సదరు యాప్ కు గతంలో ఇచ్చిన అనుమతిని తర్వాత కాలంలో తొలగించేందుకు కూడా రుణగ్రహీతలకు ఆప్షన్ ఇవ్వాలని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles