ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తరచూ పలు ఆసక్తికర అంశాలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటారు. తాజాగా నెక్ట్స్ జనరేషన్ ఆఫ్ టాలెంట్ అంటూ నడిరోడ్డుపై ఓ బాలుడు చేసిన అద్భుత విన్యాసాలతో కూడిన వీడియోను నెట్టింట షేర్ చేశారు. ఈ షార్ట్ క్లిప్‌లో బాలుడు రోడ్డు మధ్యలో గాలిలోకి ఎగురుతూ జంప్ చేస్తూ చేసిన జిమ్నాస్టిక్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
ఈ టాలెంట్‌ను పాస్ట్ ట్రాక్‌లో మనం పదును పెట్టాల్సిన అవసరం ఉందనే క్యాప్షన్‌తో ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేసిన వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. తమిళనాడులోని తిరునల్వేలి సమీపంలోని ఓ గ్రామంలో విన్యాసాలు చేస్తుండగా తన స్నేహితుల్లో ఒకరు చూసి వీడియోను పోస్ట్ చేశారని ఆనంద్ మహింద్ర పేర్కొన్నారు. కామన్వెల్త్ గేమ్స్2022లో స్వర్ణం గెలుచుకున్న తర్వాత తర్వాతి తరం నైపుణ్యాలు ముందుకొస్తున్నాయని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.
ఈ వీడియోకు ఇప్పటివరకూ 1,18,000కిపైగా వ్యూస్ రాగా 6000కు పైగా లైక్స్ వచ్చాయి. ఈ చిన్నారి భవిష్యత్ ప్రపంచ జిమ్నాస్టిక్ చాంపియన్ అని పలువురు నెటిజన్లు ప్రశ్నించగా, ఈ బాలుడికి శిక్షణ ఇప్పించి, భారత ఒలింపిక్స్ టీమ్‌లో చేర్చేలా ఎవరో ఒకరు చొరవ చూపాలని మరికొందరు యూజర్లు వ్యాఖ్యానించారు. ఈ బుడతడు జిమ్నాస్ట్ ట్రిక్స్‌ను ఇప్పటికే నేర్చుకున్నాడని మరో నెటిజన్ ప్రశంసించారు. ఇక ఇండియా రాక్స్, ఫ్యూచర్ సూపర్‌స్టార్ అంటూ మరికొందరు బాలుడిని ఆకాశానికెత్తేశారు.
And after the Gold rush for India at the #CWG2022 the next generation of talent is shaping up. Unsupported. We need to get this talent on the fast track. (This video shared by a friend who has seen this boy in a village near Tirunelveli) pic.twitter.com/DXBcGQjMX0
— anand mahindra (@anandmahindra) August 9, 2022
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more