సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వీడియోలు ఏవైనా ఇలా పోస్ట్ చేయగానే లక్షల్లో వ్యూస్, పెద్ద సంఖ్యలో లైక్స్ రాబడుతుంటాయి. ఇక మూగజీవాలకు సంబంధించిన వీడియోలూ క్షణాల్లోనే వైరల్‌గా మారుతున్నాయి. సాధు జంతువులను కంటికి రెప్పలా కాపాడుకునే వారు మూగజీవాలకు ఆసరాగా నిలస్తున్న వీడియోలూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల ప్రశంసలకూ నోటుకుంటున్నాయి. ఒక జంతువులలోకి అత్యంత శ్రేష్ట్రమైన ప్రాణి ఏదీ అంటే ఆవు అని చెప్పక తప్పదు. దానిని హిందువులు గోమాత అంటూ ఆరాధన కూడా చేస్తారు.
అలాంటి గోమాత గురించి అనేక హైందవ పురాణాలు ఎంతో విశిష్టతను చాటుతుంటాయి. ఆ గోమాతల ప్రాముఖ్యత గురించి కొందరు ప్రవక్తలు ఎంతో బాగా చెబుతారు. గోమాతను పూజించేందుకు కూడా కల్పాలు రాయబడి ఉన్నాయని, వాటిని పంచగవ్యాలను సిద్దం చేసుకునే పూజిస్తారని కూడా చెబుతుంటారు. అలాంటి గోమాతలపై అకారణంగా దాడి చేస్తే ఏం జరుగుతుంది అన్న అనుమానాలు చాలా మందిలో కలుగుతుంటాయి. సాధు జంతువులను క్రూరంగా హింసించే ప్రబుద్ధులపై నెటిజన్లు విరుచుకుపడినా.. ఆ ఘటనలు మాత్రం ఆగవు. ఇక వీటికి సమాధానం ఎందరు చెప్పినా.. చెవికెక్కని ప్రబుద్దులకు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారిన ఈ వీడియోనే బదులు చెబుతుంది.
సూటూ బూటూ వేసుకున్న ఓ వ్యక్తి ఆవులను తోలుతూ వాటి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. కర్రతో కొడుతూ హింసిస్తుండగా ఓ లేగదూడకు చిర్రెత్తుకొచ్చిందో ఏమో ఒక్కసారిగా ఎగిరి అతడి గుండెలపై తన్నింది. లేగదూడ విరుచుకుపడటంతో కంగుతిన్న సదరు వ్యక్తి దాని దెబ్బకు కిందపడటంతో స్టైలిష్ కోటుకు కాస్తా బురుద అంటుకుంది. ఫిజెన్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేయగా ఏకంగా 37 లక్షల వ్యూస్ వచ్చాయి. పెద్దసంఖ్యలో నెటిజన్లు లైకులు కొడుతూ రీట్వీట్లు చేస్తుండటంతో సోషల్ మీడియాలో ఇది తెగ వైరలవుతోంది. ఈ తింగరోడికి ఇలా శాస్తి జరగాలని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు.
That calf is a savage pic.twitter.com/mBpo87Muh4
— Mesh(@rahsh33m) August 2, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more