కుంభంకోణం తందంతోట్టంలోని నదనపురీశ్వరార్ శివన్ ఆలయంలో దాదాపు 50 సంవత్సరాల కిందట అదృశ్యమైన పార్వతీ దేవి విగ్రహం న్యూయార్క్‌లో ప్రత్యక్షం కావడం సంచలనాన్ని రేకెత్తిస్తోంది. తమిళనాడు పోలీసులు, విమానాశ్రయం భద్రత, కస్టమ్స్ అధికారులు.. అందరినీ దాటుకుని ఈ అమ్మవారి విగ్రహం తమిళనాడు నుంచి అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ ఎలా చేరింది అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అర్ధశతాబ్ద కాలం తర్వాత అమ్మవారి విగ్రహాన్ని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లో గుర్తించినట్టు తమిళనాడు సీఐడీ పోలీసులు వెల్లడించారు.
1971లో విగ్రహం అదృశ్యంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. 2019, ఫిబ్రవరిలో కే వాసు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సీఐడీ ఐడల్ వింగ్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా.. కేసు పెండింగ్‌లో ఉన్నది. కాగా ప్రస్తుతం ఆ విగ్రహం న్యూయార్క్‌లోని బోన్‌హామ్స్ ఆక్షన్ హౌస్‌లో ఈ విగ్రహం కనిపించిందని సీఐడీ పోలీసులు పేర్కన్నారు. ఐడల్ వింగ్ ఇన్‌స్పెక్టర్ ఎం చిత్ర నేతృత్వంలో దర్యాప్తు జరుగుతున్నది. ఈ క్రమంలో విదేశాల్లో ఉన్న వివిధ మ్యూజియాలు, యాక్షన్ హౌస్‌ల్లో చోళులకాటి నాటి పార్వతి విగ్రహం గురించి పరిశోధించగా.. ఇటీవల ఓ విగ్రహం వారి దృష్టిని ఆకర్షించింది.
ఆ విగ్రహం గురించి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత బోన్‌హామ్స్ యాక్షన్ హౌస్‌లో ఉన్నది 50 సంవత్సరాల క్రితం అదృశ్యమైన విగ్రహంగా నిర్ధారించారు. సుమారు 12వ శతాబ్దానికి చెందిన చోళుల కాలం నాటి ఈ రాగి విగ్రహం ఎత్తు 52 సెంటీమీటర్లు ఉంటుందని, విలువ 212,575 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.1,68,26,143) అని ఐడల్ వింగ్ పేర్కొంది. ఈ సందర్భంగా ఐడల్ వింగ్ సీఐడీ డీజీపీ జయంత్ మరళీ ఆధ్వర్యంలో బృందం విగ్రహానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more