Young woman who transfused HIV blood for love ప్రేమ కోసం హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించుకున్న యువతి

Assam girl injects hiv positive blood of her boyfriend into her body in sualkuchi

Girl, Love, HIV infected blood, Satdola, HIV-positive boyfriend, Hajo police, girl arrested for injecting HIV blood, medical observation, Sualkuchi district, Assam

There is a saying that 'Love Has No Boundary' and 'Everything Is Fair In Love And War' -- this has been proved by a girl in Assam's Sualkuchi district. The girl, who claimed herself to be deeply in love with her boyfriend, risked her life for the sake of love. She injected HIV infected blood of her boyfriend into her body.

ప్రియుడితో చిరకాలం కలసి ఉండాలని.. హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించుకున్న యువతి..

Posted: 08/06/2022 04:37 PM IST
Assam girl injects hiv positive blood of her boyfriend into her body in sualkuchi

ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు అన్న పాట చాలా పాపులర్.. కానీ ప్రేమంటే ఇదేరా అన్న మాట కూడా చాలా పాపులర్. ఈ ప్రేమ అనే రోగం కుడితే.. చాలా వరకు ఎవరి మాట వినరు. వీరిద్దరికీ ఏ కష్టమోచ్చినా.. ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్దపడతారు. అలాంటిదే ఒక ఘటన ఇది. తాను ప్రేమించిన ప్రియుడికి అరుదైన రోగం ఉందని తెలుసుకున్న ఓ ప్రియురాలు.. సమాజంలో ఏ ప్రేయసి చేయని పనిని చేసింది. తాను కూడా అరుదైన ఆ రోగం బారిన పడింది. అదెలా అంటే తన ప్రేమికుడు హెచ్ఐవీ బాధితుడని తెలిసి.. అతడితో కలిసి నడవాలని నిర్ణయించుకుంది.

అందుకు అమె.. అతడి రక్తాన్ని ఎక్కించుకుని తాను కూడా హెచ్ఐవీ బాధితురాలిగా మారింది. అసోంలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశమైంది. కామరూప్ జిల్లాలోని సువల్‌కచికి చెందిన 19 ఏళ్ల యువతికి మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో పొరుగూరికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా మొగ్గతొడిగి ప్రేమగా మారింది. ఆపై ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఒక రోజు తాను ప్రేమిస్తున్న యువకుడు హెచ్ఐవీ బాధితుడని యువతికి తెలిసింది. అయినప్పటికీ అతడితోనే జీవితాన్ని పంచుకోవాలని భావించిన ఆమె.. మూడుసార్లు అతడితో కలిసి ఊరొదిలి వెళ్లిపోయింది.

కుటుంబ సభ్యులు వెతికి తీసుకొచ్చారు. దీంతో తాము పెళ్లి చేసుకున్నా తమను విడదీస్తారని భయపడింది. ఇకపై అలా కాకూడదంటే తాను కూడా హెచ్ఐవీ బాధితురాలిగా మారిపోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఓ రోజు అతడి రక్తాన్ని ఆమె తన శరీరంలోకి ఎక్కించుకుంది. విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిని అరెస్ట్ చేశారు. యువతికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో యువతి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించుకున్నట్టు తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles