Jagdeep Dhankhar is India's new Vice President భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ ఖడ్

Jagdeep dhankhar is india s new vice president defeats opposition s margaret

Jagdeep Dhankhar, Narendra Modi, PM Modi, National Democratic Alliance, Vice Presidential candidate, Margaret Alva, Opposition, National Politics

National Democratic Alliance Vice Presidential candidate Jagdeep Dhankhar on Saturday won the vice-presidential election to be the 14th VP of India. He was pitted against Opposition's pick Margaret Alva. As many as 725 MPs of the total 780 voted in the elections. Around 93 per cent polling was recorded in the vice presidential election on Saturday, with more than 50 MPs not exercising their franchise. Dhankar achieved 528 votes while Margaret Alva received 182 votes. 15 votes remained invalid.

భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ థన్ ఖడ్ గెలుపు

Posted: 08/06/2022 06:44 PM IST
Jagdeep dhankhar is india s new vice president defeats opposition s margaret

ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై.. ఆ వెంటనే ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 725(92.94%) ఓట్లు పోలయ్యాయి. నిజానికి పార్లమెంట్‌ ఉభయ సభల్లో సభ్యుల సంఖ్య 788 కాగా.. 8 ఖాళీలున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓటింగ్‌కు దూరంగా ఉంది.

అయినా.. ఆ పార్టీకి చెందిన శిశిర్‌ కుమార్‌ అధికారి, దివ్యేందు అధికారి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలో మొత్తం 725 ఓట్లు పోలవ్వగా.. 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. మిగతా వాటిల్లో ధన్‌ఖడ్‌కు 528, యూపీఏ బలపరిచిన అభ్యర్థి మార్గరేట్‌ అల్వాకు 182 ఓట్లు వచ్చాయి. ధన్‌ఖడ్‌కు 346 ఓట్ల ఆధిక్యం లభించింది. ధన్‌ఖడ్‌ గెలుపుతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.ఫలితాలు వెలువడగానే.. ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ముర్ము కూడా ఆయన్ను అభినందిస్తూ.. ధన్‌ఖడ్‌ ఎన్నికతో దేశ ప్రజలకు లబ్ధి కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుత ఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఆ పార్టీ సీనియర్‌ రాహుల్‌ గాంధీ, యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరేట్‌ అల్వా తదితరులు కూడా ధన్‌ఖడ్‌కు నేరుగా.. ట్విటర్‌లో అభినందనలు తెలిపారు. నిజానికి ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఆశావహుల్లో గానీ, ఎన్డీయే పరిశీలనలో ఉన్న జాబితాలో గానీ, తొలుత జగదీప్‌ పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడినే మరోసారి కొనసాగిస్తారని వార్తలు వచ్చాయి. కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ, కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌, జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌లలో ఒకరికి అవకాశం లభిస్తుందని వార్తలు వచ్చాయి.

యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లోత్‌ల పేర్లు కూడా ఉపరాష్ట్రపతి రేసులో వినిపించాయి. వీరెవరినీ కాకుండా జగదీప్‌ పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేయడం గమనార్హం. ‘కిసాన్‌ పుత్ర’ పేరుతో ఆయన్ను బరిలో దింపినట్లు బీజేపీ స్పష్టం చేసింది. ఇలా అనూహ్యంగా బరిలో నిలిచినా.. ధన్‌ఖడ్‌ విజయం మాత్రం నల్లేరుపై నడకే అయ్యింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య పదవీకాలం ఈ నెల 10న ముగుస్తుంది. ఆ తర్వాతి రోజే ధన్‌ఖడ్‌ ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles