Zomato Offers Help to Young Boy Who Turned Delivery Agent డెలివరీ బాయ్ విద్యకు.. అతని తండ్రి ప్రమాదానికి జోమాటో సాయం

School boy works as zomato delivery agent after father s accident internet applauds

zomato, delivery agent, boy, school boy, fathers accident, zomato reacts, help, aid, account, young boy, viral, twitter, rahul mittal, Zomato Delivery Partner,Zomato Viral Video,Zomato Statement,7 Yr Old Zomato Delivery Boy,Zomato Twitter Video

The Zomato spokesperson said that the boy’s family has been educated in the matter and offered to support the education of the boy. The boy’s father joined Zomato post his accident and hence the company’s accidental support for employees does not extend to him. However, as an exception on humanitarian grounds, the spokesperson said that the company’s teams have extended whatever support is possible in the situation.

జొమాటో పెద్ద మనసు: డెలివరీ బాయ్ విద్యకు.. అతని తండ్రి ప్రమాదానికి సాయం

Posted: 08/06/2022 12:09 PM IST
School boy works as zomato delivery agent after father s accident internet applauds

ప్రముఖ ఫుడ్ ఆర్డరింగ్ యాప్ జొమాటో డెలివరీ బాయ్ గా ఏడేళ్ల బాలుడు ఇంటింటికీ డెలివరీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ మిట్టల్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పంచుకున్నారు. మిట్టల్ ఇటీవల జొమాటోలో ఓ చాక్లెట్ బాక్స్ ఆర్డర్ చేశారు. అయితే, ఆర్డర్ డెలివరీ చేసేందుకు పెద్దవాళ్లు వస్తారనుకుంటే, తలుపు దగ్గర ఏడేళ్ల పిల్లవాడిని చూసి మిట్టల్ ఆశ్చర్యపోయారు. ఆ అబ్బాయి చేతిలో తాను ఆర్డర్ చేసిన చాక్లెట్ బాక్స్ ఉండడంతో అతడు జొమాటో నుంచి వచ్చాడని అర్థమైంది. దాంతో, మిట్టల్ కు ఆ పిల్లవాడి పట్ల ఆసక్తి కలిగింది.

అసలు, జొమాటోలో నువ్వెలా చేరావు? అని ప్రశ్నించాడు. అందుకు అబ్బాయి బదులిస్తూ, తాను జోమాటోలో చేరలేదని.. తన తండ్రి ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నానని చెప్పాడు. అంటే వాస్తవానికి జొమాటో బాలుడి తండ్రి డెలివరీ వాలెట్ గా పనిచేసేవాడని వెల్లడించాడు. కాగా, ఇటీవల జరిగిన రోడ్డుప్రమాదంలో తన తండ్రి గాయపడి ఇంటికే పరిమితం కావడంతో తన ఇంటి పోషణ కోసం తానే తన తండ్రి తరఫున తానే జొమాటో ఆర్డర్లు డెలివరీ ఇస్తున్నానని వివరించాడు. మరి నువ్వు స్కూలుకు వెళ్లవా? అని ప్రశ్నించగా, పగలు స్కూలుకు వెళతానని, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జొమాటో ఆర్డర్డు డెలివరీ ఇస్తానని తెలిపాడు.

కాగా, ఆ బాలుడు తన తండ్రి తరఫున ఉద్యోగం చేస్తున్న విషయం జొమాటోకు కాస్త ఆలస్యంగా తెలిసింది. ఈ అంశంలో జొమాటో పెద్దమనసుతో స్పందించింది. ఆ కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి కఠినచర్యలు తీసుకోవడంలేదని జొమాటో వెల్లడించింది. కానీ పిల్లలతో పని చేయించడం బాలకార్మిక చట్టం ప్రకారం వ్యతిరేకం కాబట్టి ఈ విషయంలో వారికి చట్టంపై అవగాహన కల్పించింది. ఈ విషయాన్ని తమ దృష్టికి తెచ్చిన సోషల్ మీడియాకు కృతజ్ఞతలు తెలిపింది. కాగా, అందరూ అనుకుంటున్నట్టు ఆ బాలుడి వయసు ఏడేళ్లు కాదని, 14 ఏళ్లు అని జొమాటో చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles