Sweet job: Chief Candy Officer needed for candy company చక్కెర గోలీలను తినడమే పని.. అందుకు నెలకు 6 లక్షల జీతం.!

Canadian candy company is offering over 60 lakh a year for a chief candy officer

Candy company, salary, Chief Candy Officer, Job Offer, Tasting Candies, Instagram, Candy, chief candy officer, canada, candy funhouse, ontario, candy taster, Candyologists, Newark, Toronto, job, job vacancy, North america

A candy company in Canada is hiring a professional taste tester, with a salary of up to $100,000 (Over ₹ 60 lakh) per year. Candy retailer Candy Funhouse last month announced that it is looking for a "Chief candy officer" to lead the company's "Candyologists". Taking to Instagram, the Ontario-based firm posted the job listing and said the position is open to ages 5 plus.

స్వీట్ జాబ్: క్యాండీలను తినడమే పని.. అందుకు నెలకు 6 లక్షల జీతం.!

Posted: 08/03/2022 09:06 PM IST
Canadian candy company is offering over 60 lakh a year for a chief candy officer

ఏ దుకాణంలోనైనా చక్కెర గోలీలను చూడగానే మన నోరూరడం ఖాయం. చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల చక్కెర గోలీలను మనం రుచి చూసి ఉంటాం. ప్రస్తుతం ఎన్నో వెరైటీలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. రకరకాల పేర్లతో మనల్ని ఆకర్శిస్తున్నాయి. ఇలా చక్కెర గోలీలను అదేనండీ క్యాండీలను తినడమే తమకు ఉద్యోగంగా మారితే ఎలా ఉంటుంది. చిన్నారులైతే ఎగిరి గంతేస్తారు. కానీ అలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా.? అన్న అనుమానాలు కూడా చాలామందిలోనూ ఉంటాయి. కానీ నిజానికి అలాంటి ఉద్యోగాలు ఉంటాయన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

ఎందుకంటే ప్రతీ క్యాండీకి విభిన్నమైన ఫ్లేవర్ ఉంటుంది. వాటి ఎసెన్స్ కూడా భిన్నంగా ఉండాల్సి ఉంటుంది. ఇలా ప్రతీ అంశంలోనూ భిన్నత్వంతో కూడుకుంటుంది ప్రతీ క్యాండీ. అప్పుడే చిన్నారులు వాటి రుచి, రంగును, డిజైన్, ఎస్సెన్స్ ల పరంగా వాటికి ఆకర్షితులవుతారు. దాంతో విభిన్న రకాల క్యాండీల సేల్స్ ఈ అంశాలపైనే ఆదారపడివుంటాయి. ఇక వీటి తయారీకి చాలా ప్రాధాన్యం ఉంటుంది. వీటి రుచి ఎప్పుడూ ఒకేలా ఉండేందుకు కంపెనీలు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటాయి. వీటి రుచి ఎలా ఉన్నాయో చెప్పేందుకు ప్రత్యేక ఉద్యోగులను కూడా కొన్ని కంపెనీలు నియమించుకుని తమ ప్రాడక్ట్‌లను అత్యుత్తమంగా ఉండేలా కాపాడుకుంటుంటాయి.

ఈ కోవకు చెందినదే కెనడాకు చెందిన ఈ క్యాండీ కంపెనీ. ఈ కంపెనీ వివిధ క్యాండీలను ఉత్పత్తి చేసి కెనడాతో పాటు విదేశాల్లో అమ్ముతున్నది. ఈ కంపెనీ నుంచి దాదాపు 3,500 రకాల క్యాండీలను తయారుచేస్తున్నది. తమ క్యాండీల రుచిని జాగ్రత్తగా కాపాడుకుంటూ అన్ని వయసుల వారిని ఆకర్శిస్తున్నది. అయితే, క్యాండీల రుచిని ఎప్పటిమాదిరిగా ఉండేందుకు ‘చీఫ్‌ క్యాండీ ఆఫీసర్‌-సీసీఓ’ ఉద్యోగిని నియమించుకునేందుకు క్యాండీ ఫన్‌ హౌజ్‌ సంస్థ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు పచ్చజెండా ఊపారు.

తమ ఉత్పత్తులను రచి చూసి చెప్పడమే కాకుండా రుచిని కాపాడేందుకు ‘చీఫ్‌ క్యాండీ ఆఫీసర్‌’ ఉద్యోగి కావాలంటూ ట్విట్టర్‌లో సంస్థ ఒక ప్రకటనను పోస్ట్‌ చేసింది. ఈ డ్రీమ్‌ జాబ్‌కు 5 ఏండ్లు పైబడిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి ఏడాదికి రూ.60 లక్షలు ( లక్ష అమెరికన్‌ డాలర్లు) జీతంగా ఇవ్వనున్నారు. దరఖాస్తులు ఆగస్ట్‌ 31 లోగా సంస్థకు చేరేలా పంపుకోవాలి. కెనడియన్లు టొరంటో లేదా నేవార్క్‌ నుంచి, అమెరికా రెసిడెంట్లు ఇంటి నుంచి విధులు నిర్వర్తించేందుకు అకాశం కల్పిస్తున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles