AP likely to receive rains for next three days రానున్న మూడు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు..

Heavy rain forecast for telangana imd issues yellow alert

Meteorological Department, Monsoon trough, Rains, Rains in AP, rains in telangana, hyderabad, hyderabad rains, rains, heavy rain in hyderabad, hyderabad rains news, hyderabad rains today, hyderabad rains latest news, disaster response force ghmc, hyderabad, rainfall, GHMC, Low lying area, Hyderabad rains, telangana rains, AP Weather, Weather update, Monsoon, Telangana rains, Andhra Pradesh Rains

The Meteorological Department has issued rain forecast for Andhra Pradesh. Monsoon trough which has been in the north for four to five days turned towards the south. Also, surface trough continues in the vicinity of Odisha and Chhattisgarh. The weather department said that rains would occur at many places in the coastal Andhra and in Rayalaseema.

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఏపీలోనూ విస్తారం

Posted: 08/01/2022 06:40 PM IST
Heavy rain forecast for telangana imd issues yellow alert

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ నెల 5వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సోమవారం యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని చెప్పింది. ఈ నెల 3న ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని, పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 4న కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. 5న రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.

ఈ నెల 4 వరకు ఏపీలో విస్తారంగా వర్షాలు

అటు ఏపీలోనూ రానున్న మూడు రోజుల్లో వర్షాలు విరివిగా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఏపీలోని వాతావరణ పరిస్థితులకు సంబంధించి అమరావతి వాతావరణ కేంద్రం సోమవారం ఒక నివేదికను విడుదల చేసింది. ఆదివారం నాడు ఉత్తర-దక్షిణ మధ్య ఏర్పడిన ద్రోణి.. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్‌ వరకు సరాసరి సముద్ర మట్టం 0.9గా ఉండటంతో రానున్న మూడు రోజులపాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇది నిన్న రాయలసీమ, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో, ఇవాళ కోస్తా తమిళనాడు, పరిసర ప్రాంతాలకు విస్తరించిందని పేర్కొన్నది. రానున్న మూడు రోజులపాటు ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా ఆంధ్రా ప్రాంతంలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, ఇవాళ కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నది. మంగళవారం నాడు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నదని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles