Veteran comedian Kadali Jaya Sarathi passes away మొన్నటి తరం సీనియర్ కమేడియన్ సారధి ఇకలేరు..

Veteran comedian kadali jaya sarathi passes away

Tollywood Veteran comedian, comedian Kadali Jaya Sarathi, comedian Sarathi passed away, comedian, Kadali Jaya Sarathi, Sarathi, passed away, kidney problems, Citi neuro centre hospital, Last rites, Maha Prasthanam, Tollywood

Popular film comedian Kadali Jaya Sarathi passed away this morning. He was 83 years old. As per reports, Sarathi breathed his last at 2:30 am, after being treated at Citi neuro centre hospital for the past one month with kidney problems. The last rites will be held today at 1 pm in Maha Prasthanam. Sarathi made his silver screen debut in 1960 with Sitarama Kalyanam.

మొన్నటి తరం సీనియర్ కమేడియన్ సారధి ఇకలేరు..

Posted: 08/01/2022 11:28 AM IST
Veteran comedian kadali jaya sarathi passes away

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ హాస్య న‌టుడు కడ‌లి జ‌య‌సార‌థి(80) క‌న్నుమూశాడు. గ‌త కొద్ది రోజుల‌గా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న జ‌య‌సార‌థి.. చికిత్స పొందుతూనే సిటీ న్యూరో హాస్పిట‌ల్‌లో తుదిశ్వాస విడిచాడు. ఈయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుతున్నారు. జ‌య‌సార‌థి దాదాపు 372 సినిమాల్లో న‌టించి టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో త‌న కంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నాడు. జ‌య‌సార‌థి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోని భీమ‌వ‌రంలో 1942 జూన్ 26న జ‌న్మించాడు.

సరిగ్గా 18 ఏళ్లకే సినీరంగ ప్రవేశం చేసిన ఆయన సీతారామ కళ్యాణం చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యాడు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘వెలుగు నీడ‌లు’ చిత్రం ఆయనకు గుర్తింపును తీసుకువచ్చింది. ‘మ‌నఊరి రామాయ‌ణం’, ‘బొబ్బిలి బ్ర‌హ్మ‌ణ‌’, ‘డ్రైవ‌ర్ రాముడు’, ‘భ‌క్త క‌న్న‌ప్ప’ వంటి సినిమాల‌తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయ‌న చివ‌ర‌గా సుమన్‌, రంభ హీరో హీరోయిన్లుగా న‌టించిన ‘హ‌లో అల్లుడు’ సినిమాలో డాక్ట‌ర్ పాత్ర‌లో న‌టించాడు. ఇక జ‌య‌సార‌థి అంత్య‌క్రియ‌లు మ‌ధ్యాహ్నాం 2గంట‌ల‌కు ‘మ‌హా ప్ర‌స్థానం’లో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles