Rains lash Hyderabad on Monday morning హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. వాహనదారులకు కష్టాలు..

Heavy downpour in hyderabad on monday morning

hyderabad, hyderabad rains, rains, heavy rain in hyderabad, hyderabad rains news, hyderabad rains today, hyderabad rains latest news, disaster response force ghmc, hyderabad, rainfall, GHMC, Low lying area, Hyderabad rains, telangana rains, Telangana

Rains lashed many parts of the city on Monday morning. Till 11:00 am the highest rainfall of 73.8 mm was recorded at Malkajgiri followed by Maredpally (66.5 mm) and Uppal (55.3 mm). Telangana State Development Planning Society (TSDPS) has predicted thunderstorms with light to moderate intensity rainfall over Hyderabad on Monday.

హైదరాబాద్‌పై వరుణుడి ప్రతాపం.. గంటన్నర పాటు దంచికోట్టిన వాన..

Posted: 08/01/2022 12:23 PM IST
Heavy downpour in hyderabad on monday morning

వర్షాకాలం ప్రారంభమైన జూన్ 6 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ నగరంపై వరుణుడు తన ప్రతాపాన్ని చాటుతూనే ఉన్నాడు. గత నెలలో రెండో వారం ఆరంభం నుంచి మూడవ వారం చివరకు వరకు ప్రతీరోజు కుండపోతగా కురిసిన వర్షం.. నగరంలోని జంట జలాశయాల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదిలేలా చేసింది. ఇక కాసింత ఎడతెరపిని ఇవ్వడంతో హమ్మయ్య అని ఊపిరి తీసుకుంటున్న హైదరాబాద్ నగరవాసులపై మళ్లీ వరుణుడు తన ప్రతాపాన్ని చాటాడు. గత వారం రోజులుగా నగరంలోని ఏదో ఒక ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా ఇవాళ హైదరాబాద్‌లో భారీ వర్షం కురుసింది.

ఉదయం ఎండ కొట్టినప్పటికీ.. క్రమంగా మబ్బులు కమ్ముకోవడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట, కూకట్‌పల్లి, ఎర్రమంజిల్‌, ఖైరతాబాద్‌, బషీర్‌బాగ్‌, అమీర్‌పేట, తర్నాక, చింతల్‌బస్తి, సోమాజిగూడ, నాంపల్లి, లక్డీకపూల్‌, కోఠిలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, మాదాపూర్‌, లింగంపల్లి, మదీనాగూడ, హైదర్ నగర్, ఉప్పల్‌, ఓయూ క్యాంపస్‌, నాచారం, మల్లాపూర్‌, కాప్రా, ఈసీఐఎల్‌, సికింద్రాబాద్‌, బేగంపేట, ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో భారీ వర్షం పడుతున్నది. చాదర్‌ఘాట్‌, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌లో వర్షం కురుస్తున్నది.

అయితే ఒక్కసారిగా వరణుడు విరుచుకుపడటంతో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. సోమవారం రోజున ఉదయం కార్యాలయాలకు, ఉద్యోగాల కోసం బయల్దేరిన వాహనదారులు ఇబ్బంది పడాల్సివచ్చింది. రోడ్లపై వర్షపునీరు నిలవడంతో వాహనాలు నెమ్మదిగా కదులాయి. పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద భారీగా వాన నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ నెల 3,4 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారాల్లో కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడుతాయని వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles