Anand Mahindra shares primitive device in Twitter 'గ్యాడ్జెట్ల యుగంలో ఈ ప్రాచీన యంత్రం ఎంతో అద్భుతం’: ఆనంద్ మహీంద్రా

Anand mahindra finds this primitive device efficient and stunningly beautiful

anand mahindra, anand mahindra twitter, anand mahindra tweet, anand mahindra shares video, anand mahindra posts, anand mahindra twitter post, anand mahindra sustainabil

Tech savvy Anand Mahindra on Twitter often shares about incredible and interesting things that passionate netizens find engaging. Mahindra took to Twitter to share about what sustainability may look like in an age of gadgetry, sharing with us this video of a mechanical device which he found to be "primitive" but "efficient and stunningly beautiful."

ITEMVIDEOS: 'గ్యాడ్జెట్ల యుగంలో ఈ ప్రాచీన యంత్రం ఎంతో అద్భుతం’: ఆనంద్ మహీంద్రా

Posted: 07/30/2022 06:52 PM IST
Anand mahindra finds this primitive device efficient and stunningly beautiful

చెక్కముక్కలతో చేసిన యంత్రం నీటి సాయంతో చేస్తున్న పనితీరును ప్రశంసించారు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. అంతేకాదు ఆయన మదిని దోచుకున్న ఈ మెకానికల్ పరికరం పనిచేస్తున్న తీరును తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఆయన.. తన సంస్థకు చెందిన విషయాలతో పాటు తన మదిని తాకిన అద్భుత వీడియోలను కూడా నిత్యం తన ఫాలోవర్స్ తో పంచుకుంటారు. ఇందులో భాగంగా ఇవాళ ఆయన ప్రాచీన కాలంలో అప్పటి మనుషులు వినియోగించిన యాంత్ర సాంకేతికను అభిమానులతో పంచుకున్నారు.

ప్రాచీన కాలంలో, టెక్నాలజీ లేని రోజుల్లో ఈ తరహా యంత్రాలు మనుషుల అవసరాలను ఎలా తీర్చాయన్నది వీడియోను చూస్తే అర్థమవుతోంది. వేగంగా ప్రవహించే చిన్న కాలువలోని నీటి ప్రవాహ మార్గానికి అడ్డంగా చెక్కతో చేసిన చక్రాన్ని పెట్టారు. నీటి ప్రవాహ ఒత్తిడికి ఆ చక్రం తిరుగుతుంది. చక్రానికి మరోవైపున ఓ చెక్క ముక్కను ఏర్పాటు చేశారు. దీని సాయంతో మహిళ బియ్యం, ఇతర ధాన్యాలను దంచి, పొడుంగా మార్చే పని చేస్తోంది. ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా తన స్పందనను ట్వీట్ రూపంలో తెలియజేశారు.

‘‘చుట్టూ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్న కాలంలో.. ఈ ప్రాచీన మెకానికల్ పరికరం కేవలం సమర్థవంతమైనదే కాదు. ఎప్పటికీ పనిచేసేది. ఎంతో అందమైనది. కేవలం మెషిన్ కాదు. మొబైల్ శిల్పం’’ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.  దీనికి నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ‘‘బియ్యం దంచే ఈ పరికరాన్ని ఒడిశాలో దింకి కుటా రైస్ అంటారు. ఇప్పటికీ చాలా మంది గిరిజన రైతులు దీన్నే వాడుతుంటారు’’ అని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. తమ గ్రామంలోనూ ఇది ఉందని యూపీకి చెందిన మరో వ్యక్తి స్పందించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anand Mahindra  Mahindra Group  Twitter  primitive device  Viral news  viral video  video viral  

Other Articles