China regional banks have never been safe బ్యాంకులపై కస్టమర్ల నిరసన.. యుద్ద ట్యాంకులతో గురి.!

China s henan bank crisis despite promises banks fail to repay depositors

China, China economy, China's economic slowdown, China's real estate crisis, China's banking crisis, Henan banking crisis, Rising debt levels in China's banks, China's growth, Covid 19, Rising debt, China banks, Henan, china banking crisis, henan banking crisis, Henan province, Anhui province, china banking scandal, china banking crisis news

A video showing tanks lined up on a road in China has shocked the internet. Quoting local media outlets, users on Reddit say that the footage is from Rizhao, in Shandong Province and the tanks have been deployed to protect the local branch of a bank at the heart of a scandal.

చైనా చిత్రం: బ్యాంకులపై కస్టమర్ల నిరసన.. యుద్ద ట్యాంకులతో గురి.!

Posted: 07/22/2022 05:27 PM IST
China s henan bank crisis despite promises banks fail to repay depositors

ది బ్యాంక్‌ ఆఫ్‌ చైనా బ్రాంచి ప్రజల డిపాజిట్లను పెట్టుబడులుగా మార్చినట్లు ప్రకటించింది. దీంతో అక్కడి ప్రజలు బ్యాంకుల వద్ద ఆందోళన చేపట్టారు. తాము బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును.. అవి ఏ విధంగా పెట్టుబడులుగా మార్చేస్తాయంటూ నిరసనన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తిరగబడితే వారిని నియంత్రించడానికి షాన్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని రిఝోలోని ఓ బ్యాంకు వద్ద రక్షణగా యుద్ధట్యాంకులు రక్షణగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చాలా ఆంగ్ల పత్రికలు.. ఈ ట్యాంకులు బ్యాంకు రక్షణ కోసం వచ్చినవే అని కథనాలు ప్రచురించాయి.

కానీ, బ్లాగర్‌ జెన్నిఫర్‌ జెంగ్‌ వంటి వారు రిఝె వద్ద నౌకాదళ స్థావరం ఉండటంతో ట్యాంకులు వెళుతున్నాయనీ.. ఇది ఏటా సర్వసాధారణమే అని పేర్కొంటున్నారు. ట్యాంకుల మోహరింపు ఎలా ఉన్నా.. గ్రామీణ బ్యాంకులపై చైనా ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నది మాత్రం వాస్తవం. హెనాన్‌ ప్రావిన్స్‌లో రాజుకొన్న అగ్గి.. జులై 10వ తేదీన చైనా సోషల్‌ మీడియా వీబొలో కొందరు డిపాజిటర్లు గ్రామీణ బ్యాంకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు చేశారు. ఆ తర్వాత దాదాపు 1,000 మంది హెనాన్‌ రాజధాని జియాంగ్‌ఝూలో ఆందోళనలు మొదలుపెట్టారు.

హఠాత్తుగా సాధారణ దుస్తుల్లో ఉన్న భద్రతాదళ సిబ్బంది దాడి చేసి వారిని చెల్లాచెదురు చేశారు. ఈ ఘటన ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ మర్నాడు నుంచి 50,000 యువాన్లలోపు విత్‌డ్రాలకు అంగీకరించారు. వచ్చే వారం నుంచి 1,00,000 యువాన్ల వరకు అనుమతి లభించవచ్చని బ్లూమ్‌బెర్గ్‌ కథనంలో పేర్కొంది. స్తంభింపజేసిన మొత్తాలను విడతల వారీగా అందజేస్తామని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి సమయంలో ఓ యాప్‌ ద్వారా చైనా ప్రభుత్వం ప్రజల డేటాను సమీకరించింది. తాజాగా ఆ యాప్‌ను ఉపయోగించుకొని పోలీసులు ఆందోళనకారుల ఫోన్లను ట్రాక్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles