No immersion of PoP idols in lakes: Telangana High Court పీఒపీ వినాయక విగ్రహాల తయారీపై హైకోర్టు కీలక ఆదేశాలు..!

Hc to telangana government ensure pop ganesh idols are not immersed in hussainsagar lake

Telangana High Court, PoP idols, PoP idols in Hussainsagar, Ganesh idols, Chief Justice Ujjal Bhuyan, Justice S Nanda, ganesh idols, hussain sagar, telangana high court, ujjal bhuyan, PoP Ganesh, Baby ponds, GHMC, Hyderabad, Telangana

The division bench of the Telangana High Court, headed by Chief Justice Ujjal Bhuyan and Justice Surepalli Nanda, directed the State government to ensure that Ganesh idols made of PoP (plaster of Paris) or any other material are "not" immersed in the Hussainsagar lake or any other lakes in Telangana, as the pollution created by the idol immersion in lakes is literally taking them to the verge of extinction.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాల తయారీపై హైకోర్టు కీలక ఆదేశాలు..!

Posted: 07/22/2022 12:37 PM IST
Hc to telangana government ensure pop ganesh idols are not immersed in hussainsagar lake

వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. పర్యావరణ వేత్తలకు, గణేష్ ఉత్సవ కమిటీల నిర్వహకులకు మధ్య అభిప్రాయబేధాలకు కారణం అవుతున్న వినాయక విగ్రహాల తయారీపై ఎట్టకేలకు రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వినాయక విగ్రహాల తయారీపై ఆదారపడిన వారి ఉపాధికి ఎలాంటి నష్టం లేకుండా రాష్ట్రోన్నత న్యాయస్థానం తాజా అదేశాలు జారీ చేసింది. దీంతో ఇకపై ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాల తయారీపై నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన బేబి పాండ్స్‌లో వాటిని నిమజ్జనం చేయాలని చెప్పింది. గతేడాది దీనికి సంబంధించి హైకోర్టు, దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పలు ఉత్తర్వులు జారీచేశాయి. గతేడాది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పీవోపీ విగ్రహాలను నిషేధించాలని మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ మార్గదర్శకాలను సవాల్‌ చేస్తూ వినాయక విగ్రహాల తయారీదారులు హైకోర్టును ఆశ్రయించారు. కరోనాకు ముందు విగ్రహాలను తయారు చేశామని, కనీసం వాటినైనా అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై సుదీర్ఘంగా విచారించిన కోర్టు.. ఇందులో తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

పీసీబీ కేవలం మార్గదర్శకాలను మాత్రమే జారీ చేసిందని, ప్రభుత్వం పీవోపీ విగ్రహాలపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేనందున తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. వివాదమంతా విగ్రహాల తయారీపై కాదని, కేవలం నిమజ్జనానికి సంబంధించిన ఈ విషయంలో మాత్రమే వస్తుందని హైకోర్టు పేర్కొంది. హైదరాబాద్‌లో నదులు, చెరువులు ఎక్కువగా లేనందున సమస్య తలెత్తుతుందని కోర్టు అభిప్రాయపడింది. బెంగాల్‌ దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంలో అక్కడ కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయని, వాటిని పరిశీలించాలని సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles