KTR ridicules Bandi’s warning of ED probe against KCR బిఎస్ కుమార్ ను ఈడీ ఛీఫ్ గా నియమించినందుకు థ్యాంక్స్ మోదీజీ: కేటీఆర్

Minister ktr satirical tweet on central govt india overtakes nigeria as the world s poverty capital

K.T. Rama Rao, TRS working president, IT minister, CM KCR, Bandi Sanjay, BJP state president, ED, Nigeria, world’s poverty capital India, Train tickets subsidy, Rupee downfall, Modi Government, Priorities, Telangana, Politics

TRS working president and IT minister K.T. Rama Rao took potshots at BJP state president Bandi Sanjay for his warning that the Enforcement Directorate (ED) will soon probe all irregularities committed by CM KCR. In a sarcastic response, Rama Rao thanked PM Modi for ‘appointing’ Sanjay as ED chief. He also took a dig at Centre's decision to do away with concessions for senior citizens in train fares.

బిఎస్ కుమార్ ను ఈడీ ఛీఫ్ గా నియమించినందుకు థ్యాంక్స్ మోదీజీ: కేటీఆర్

Posted: 07/22/2022 02:29 PM IST
Minister ktr satirical tweet on central govt india overtakes nigeria as the world s poverty capital

కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు వదిలారు. పాలు, పాల ఉత్పత్తులపై దేశచరిత్రలో తొలిసారి జీఎస్టీ విధించిన ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని ఏమనాలని.. అంటూ 24 గంటల క్రితం తనదైన శైలిలో బీజేపిపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టిన టీఆర్ఎస్ వర్కాంగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తాజాగా మళ్లీ కేంద్రాన్ని టార్గెట్ చేశారు. 'దేశంలో డబుల్ ఇంజిన్ అంటే మోడీ, ఈడీ'అని అర్థమైందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈడీ చీఫ్​గా బండిని నియమించినందుకు ప్రధాని నరేంద్రమోడీకి ఆయన ధన్యవాదాలు అంటూ సెటైరికల్ ట్వీట్ పోస్టు చేశారు.

రైతుల ఆదాయంపై ప్రధానమంత్రి మోడీ చేసిన ప్రకటనపై కూడా ఎక్కుపెట్టిన ఆయన.. దేశంలోని ఏ రైతు ఆదాయం డబుల్ కాలేదని విమర్శించారు. రైతుల నామజపం చేస్తేన్న బీజేపి.. వారి తెలియకుండానే వారి వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులపై జీఎస్టీ విధిస్తోందని మండిపడ్డారు. ఇక తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ అధినేతగా బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను నియమించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు అంటూ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపిపై కేటీఆర్ పలు అంశాలపై ట్విటర్​లో తనదైన శైలిలో స్పందించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ కూడా ఈడీ, సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధానిని ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశంలో ఉన్న డబుల్ ఇంజిన్ అంటే మోదీ, ఈడీ అని అర్థమైందని వ్యాఖ్యానించారు. అటు ఆదాని అంశంపైనా స్పందించిన కేటీఆర్... ప్రపంచ పేదరిక రాజధానిగా భారతదేశం... నైజీరియాను అధిగమించిందని.. ఇదే సమయంలో ఆదానీ బిల్ గేట్స్‌ను దాటి మరీ ప్రపంచంలోనే నాలుగో ధనవంతుడయ్యారని పేర్కొన్నారు. ఇవి దేశానికి సంబంధించి రెండు కఠోర వాస్తవాలను అని అన్నారు.

కేంద్రంలోకి బీజేపి ప్రభుత్వం వచ్చిన తరువాత దేశంలో సబ్సీడీలను పూర్తిగా ఎత్తివేస్తూ వస్తోందని కేటీఆర్ దుయ్యబట్టారు. డీజిల్ పై, వంట గ్యాస్ సిలిండర్ పై సబ్సీడీని ఎత్తివేసిన ఘనత కూడా మోడీకే దక్కుతుందని విమర్శించారు. ఇక  రైల్వేశాఖ సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను కూడా ఎత్తివేస్తుందన్న వార్తలపైనా స్పందించిన కేటీఆర్... రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత మాత్రమే కాదని, విధి కూడా అన్న ఆయన... కేంద్ర ప్రభుత్వ తమ నిర్ణయాన్ని కరుణా హృదయంతో నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు కేటీఆర్ ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles