సమాధులు తవ్వితే ఎముకలొస్తాయి. కానీ... సమాధులు తవ్వి చనిపోయిన వాళ్ల దాహం తీరిస్తే వానలొస్తాయని నమ్ముతున్నారు. ఎక్కడో కాదు.. మన పక్క రాష్ట్రం కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా కలకేరిలో కొన్ని రోజులుగా వానలు పడకపోవడంతో చనిపోయినవాళ్ల శాపమేనని నమ్మిన గ్రామస్తులు... గత నెలలో మరణించినవాళ్ల జాబితా తీశారు. వాళ్ల సమాధులకు తల ఎటువైపున్నాయో కుటుంబ సభ్యుల సహాయంతో గుర్తించారు. తలకు రెండు అడుగుల దూరంలో ఓ గుంత తవ్వి చనిపోయిన వాళ్ల నోరువైపుగా పైపు పెట్టి వాటర్ ట్యాంకర్‌తో నీటిని వదిలారు. 25 సమాధులకు అలా నీటిని పోసి, ప్రక్రియ పూర్తి చేసిన కొద్దిసేపటికే వర్షపు జల్లులు ప్రారంభమయ్యాయట.
3వేల జనాభా ఉన్న కలకేరి గ్రామస్తుల్లో ఈ నమ్మకం కొన్నేళ్ల కిందటే బలపడింది. నోరు తెరిచి చనిపోయిన ఓ వృద్ధుడి నోటిని మూయకుండానే ఖననం చేశారట. అప్పటినుంచి వానలు పడక... గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చిందట. ఓ జ్యోతిష్యుడి దగ్గరకెళ్లి అడిగితే... చనిపోయిన వృద్ధుడి గురించి చెప్పాడట. వెంటనే వెళ్లి అతని సమాధిని తవ్వి నీటిని పోస్తే... వర్షం వచ్చిందట. ఇక అప్పటినుంచి దాన్నే నమ్ముతూ వానలు రానప్పుడల్లా పాటిస్తున్నారు గ్రామస్తులు. ఈ వింత నమ్మకాలు మనదేశంలోనే కాదు..ఇతర దేశాల్లోనూ ఉన్నాయి. గ్రామంలో వానలు బాగా పడాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఇటీవల ఓ మెక్సికన్ మేయర్ మొసలినే పెళ్లి చేసుకున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more
Aug 06 | ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు అన్న పాట చాలా పాపులర్.. కానీ ప్రేమంటే ఇదేరా అన్న మాట కూడా చాలా పాపులర్. ఈ ప్రేమ అనే రోగం కుడితే.. చాలా వరకు... Read more
Aug 06 | భర్త నుంచి జీవన భృతి కోరుతూ కోర్టుకెక్కిన ముస్లిం మహిళకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ క్రమంలో గత తీర్పును కొట్టేసిన న్యాయస్థానం.. తలాక్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. షరియత్ చట్ట నిబంధలనకు... Read more
Aug 06 | తెలంగాణపై వరుణుడు ప్రతాపం చాటుతూనే ఉన్నాడు. గడిచిన రెండు నెల్లలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురియడంతో.. చెరువులు, వాగులు, వంకలు అన్ని నిండు కుండలను తలపిస్తున్నాయి. అయినా వరుణుడు శాంతించడం లేదు. ఉపరితల ఆవర్తన... Read more