సినిమాల ప్రభావమో.. లేక సీరియళ్ల ప్రభావమో తెలియదు కానీ.. చిన్నారులను నేరప్రవృత్తులుగా మార్చేసింది. పర్యవసానాలపై కించిత్ కూడా అలోచన చేయని చిన్నారులు.. ఓ వ్యక్తి తలను గురిపెట్టి తుపాకీతో కాల్పులు జరిపారు. ఇంతకీ ఆ వ్యక్తినే ఎందుకు టార్గెట్ చేశారంటే.. అతడు ఆ చిన్నారులలోని ఒకరి తండ్రిని కొట్టాడు. దీంతో అతడి కొడుకు తనపై ప్రతీకారం తీర్చుకునేందుకు తుపాకీతో అతడి ముఖంపై కాల్పులు జరిపాడు. దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన చిన్నారుల్లో నేరప్రవృత్తిపై తీవ్రచర్చకు కూడా దారితీసింది.
వివరాల్లోకి వెళ్తే అదే ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల జావేద్, శుక్రవారం సాయంత్రం స్థానిక పార్కు సమీపంలో కూర్చొని ఉన్నాడు. అతడికి తెలిసిన ముగ్గురు బాలురు అక్కడకు వచ్చారు. ఒక బాలుడు తన ప్యాంట్ జేబు నుంచి తుపాకీ తీశాడు. జావేద్‌కు దగ్గరగా వెళ్లి అతడి ముఖంపై కాల్పులు జరిపాడు. అనంతరం ఆ ముగ్గురు బాలురు అక్కడి నుంచి పారిపోయారు. కాగా, బాలుడి తుపాకీ కాల్పుల్లో జావేద్ కుడి కంటికి తీవ్ర గాయమైంది. తొలుత అతడ్ని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు జావేద్‌పై కాల్పులకు సంబంధించి నలుగురు మైనర్ బాలురను అరెస్ట్ చేశారు. అందులోని ఒక బాలుడి తండ్రిని ఏడు నెలల కిందట జావేద్ కొట్టడంతో వారు అతడిపై ప్రతీకారం తీర్చుకున్నారని పోలీసులు తెలిపారు. ఆ బాలుర నుంచి ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కంటికి బుల్లెట్ గాయమైన జావేద్ పరిస్థితి నిలకడగా ఉందన్నారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Delhi: 4 minor boys apprehended for firing at a man in Jahangirpuri on 15th July. The man has been hospitalised. Case u/s 307 IPC registered. Accused say that the man had beaten up father of one of the minors 7 months back & they had come to take revenge.
— ANI (@ANI) July 16, 2022
(Source: CCTV) pic.twitter.com/Icl2i4x3LN
(And get your daily news straight to your inbox)
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more
Aug 06 | ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు అన్న పాట చాలా పాపులర్.. కానీ ప్రేమంటే ఇదేరా అన్న మాట కూడా చాలా పాపులర్. ఈ ప్రేమ అనే రోగం కుడితే.. చాలా వరకు... Read more
Aug 06 | భర్త నుంచి జీవన భృతి కోరుతూ కోర్టుకెక్కిన ముస్లిం మహిళకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ క్రమంలో గత తీర్పును కొట్టేసిన న్యాయస్థానం.. తలాక్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. షరియత్ చట్ట నిబంధలనకు... Read more
Aug 06 | తెలంగాణపై వరుణుడు ప్రతాపం చాటుతూనే ఉన్నాడు. గడిచిన రెండు నెల్లలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురియడంతో.. చెరువులు, వాగులు, వంకలు అన్ని నిండు కుండలను తలపిస్తున్నాయి. అయినా వరుణుడు శాంతించడం లేదు. ఉపరితల ఆవర్తన... Read more