CTET Exam Notification 2022 to be released Soon డిసెంబ‌ర్‌లో సీ టెట్ 2022.. సీబీఎస్ఈ ప్ర‌క‌ట‌న‌

Ctet exam notification 2022 ctet notification to be released in december at ctet nic in

ctet 2022, ctet form 2022, ctet form, ctet notification 2022, ctet notification, ctet exam 2022, ctet exam, ctet exam date 2022, ctet exam date, ctet result 2022, ctet result, ctet application form 2022, ctet form date 2022,CTET 2022, ctet form 2022, ctet form, ctet notification 2022, ctet notification, CTET Exam 2022, CTET exam, ctet exam date 2022, Teachers Eligibility Test, Applications, computer based exam, Private Teachers, Government Teachers, National

The CBSE will soon release the CTET 2022 notification is expected to be released in July. The CTET exam will be administered online. CTET Exam Date has been set for the month of December 2022. Not only do government schools require CTET certificates, but many private teaching institutes do as well. Thus, a CTET certificate is essential for teaching candidates seeking employment in both public and private schools.

కంప్యూటర్ ఆధారంగా సీ-టెట్.. ఈ డిసెంబర్ నెలలో: సీబీఎస్ఈ ప్ర‌క‌ట‌న‌

Posted: 07/15/2022 05:23 PM IST
Ctet exam notification 2022 ctet notification to be released in december at ctet nic in

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా తీసుకువచ్చిన విధానం ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులుగా అర్హత పరీక్షలు రాసే వారితో పాటు ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్షలో ఉత్తీర్ణులు కావడం అత్యంత అవసరం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెట్ పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలని ఎదురుచూస్తే ఏళ్ల పాటు నిరీక్షించేవారు అధికం. ఇలాంటి వారి కోసం సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (సీబీఎస్ఈ) సంస్థ సీ టెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సీ టెట్ ఉత్తీర్ణులైన వారికి కేంద్రీయ విద్యాస్థంస్థలతో పాటు సీబిఎస్ఈ పాఠశాలలకు కూడా అర్హులు.

ఇక సీబిఎస్ఈ ప్రతీ ఏడాది రెండు పర్యాయాలు ఈ సీ-టెట్ పరీక్షలను నిర్వహిస్తుండగా, కరోనా మహమ్మారి విజృంభన నాటి నుంచి ఏడాదికో పర్యాయం మాత్రమే నిర్వహిస్తోంది. 2020, 2021లలో ఇలాగే నిర్వహించిన సీబిఎస్ఈ ఈ ఏఢాది డిసెంబర్ నెలలో సీటెట్ నిర్వహించేందుకు సన్నధం అవుతోంది. ఈ మేరకు సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ (సీబీఎస్ఈ) ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ప‌బ్లిక్ నోటీస్ జారీ చేసింది. ఈ కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)కు సంబంధించిన తేదీల‌ను అభ్య‌ర్థుల అడ్మిట్‌ కార్డుల్లో తెలియ‌జేస్తామ‌ని తెలిపింది. ఈ ప‌రీక్ష‌ను దేశ‌వ్యాప్తంగా 20 భాష‌ల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన సిల‌బ‌స్‌, ఎగ్జామ్ ప్యాట్ర‌న్‌, అర్హ‌త‌, లాంగ్వేజెస్, ఎగ్జామినేష‌న్ ఫీ, ఎగ్జామ్‌ సెంట‌ర్లు, అప్లికేష‌న్ తేదీల వివ‌రాల‌ను సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ https://ctet.nic.in/ లో త్వ‌ర‌లో అందుబాటులో ఉంచ‌నున్నారు. అభ్య‌ర్థులు పై వెబ్‌సైట్‌నుంచి ఇన్ఫ‌ర్మేష‌న్ బులిటెన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పూర్తిగా చ‌దువాల‌ని, ఆ త‌ర్వాతే ద‌ర‌ఖాస్తు చేయాల‌ని సీబీఎస్ఈ సూచించింది. త్వ‌ర‌లోనే అప్లికేష‌న్ తేదీల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపింది. కాగా, జ‌న‌ర‌ల్‌/ ఓబీసీ అభ్య‌ర్థుల‌కు పేప‌ర్-1 లేదా పేప‌ర్- 2కు అప్లికేష‌న్ ఫీజు రూ. వెయ్యి, రెండు పేప‌ర్ల‌కు రూ. 1200గా నిర్ణ‌యించింది. ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌సీ అభ్య‌ర్థుల‌కు పేప‌ర్-1 లేదా పేప‌ర్‌-2కు రూ. 500, రెండు పేప‌ర్ల‌కు రూ. 600గా నిర్ణ‌యించిన‌ట్లు సీబీఎస్ఈ ప‌బ్లిక్ నోటీస్‌లో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles