వర్షం పడుతున్నప్పుడు. లేదా రోడ్డుపై నీళ్లు నిలిచినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే స్థానిక పురపాలక సంఘం అధికారులతో పాటు.. విద్యుత్ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. వర్షం పడే సమయంలో విద్యుత్ స్థంబాలను తాకరాదని కూడా వారు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ అవగాహనా రాహిత్యంతో గ్రామీణ ప్రాంత ప్రజలు.. అలా చేస్తూనే ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావంతో సామాన్య ప్రజల్లోనూ కొంత అవగాహన కలిగింది. అయితే మనుషులకు ఏమైనా చెప్పోచ్చు, కానీ మూగజీవాల సంగతేంటి.?
వర్షం పడుతున్న సమయంలో రోడ్డుపైనున్న విద్యుత్ స్థంబాలను తాకరాదని వాటికి ఎవరు చెప్పాలి. వాటికోసం ఎన్ని బోర్డులు పెట్టినా ఫలితం ఏంటీ.? మాట్లాడమే రాని మూగ జీవాలకు ఇక చదవడం ఎలా వచ్చు.? అందుకనే విద్యుత్ స్థంబాలు ఉన్న చోట దాని చుట్టూ కంచె ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. చుట్టూ నీళ్లు..మధ్యలో స్థంభం.. ఆ స్థంభం వద్దకు వచ్చిన ఓ ఆవు కరెంట్ షాక్‌తో గిలగిలా కొట్టుకుంది. ఇది చూసి ఓ దుకాణ యజమాని చలించిపోయాడు. వెంటనే ప్రాణాలకు తెగించి ఆ ఆవును కాపాడాడు. మానవత్వాన్ని చాటుకున్నాడు. పంజాబ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోను ‘అనామిక జైన్ ఆంబర్’ అనే యూజర్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఆవు ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని తాకడంతో కరెంటు షాక్‌కు గురై కొట్టుకుంటోంది. ఆ ఆవును చూసిన దుకాణదారుడు పరుగెత్తుకుంటూ వచ్చి నీట్లోకి దూకాడు. ఓ గుడ్డతో ఆవు కాళ్లను కట్టి లాగాడు. చుట్టుపక్కలవారి సహాయంతో దాన్ని ప్రాణాలతో కాపాడాడు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోకు లక్షకుపైగా లైక్స్ రావడం విశేషం. ఆ దుకాణాదారుడిని రియల్ హీరో అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Not all heroes wear capes...
— Righty nor Lefty (@akhilnaithani) July 3, 2022
In Mansa, a cow got electrocuted near an electric pole and started suffering. A nearby shopkeeper dragged the cow with a cloth which saved the life of the cow. #Heroes #TheBoys #india pic.twitter.com/vLep9VJyXZ
(And get your daily news straight to your inbox)
Aug 06 | ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు అన్న పాట చాలా పాపులర్.. కానీ ప్రేమంటే ఇదేరా అన్న మాట కూడా చాలా పాపులర్. ఈ ప్రేమ అనే రోగం కుడితే.. చాలా వరకు... Read more
Aug 06 | భర్త నుంచి జీవన భృతి కోరుతూ కోర్టుకెక్కిన ముస్లిం మహిళకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ క్రమంలో గత తీర్పును కొట్టేసిన న్యాయస్థానం.. తలాక్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. షరియత్ చట్ట నిబంధలనకు... Read more
Aug 06 | తెలంగాణపై వరుణుడు ప్రతాపం చాటుతూనే ఉన్నాడు. గడిచిన రెండు నెల్లలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురియడంతో.. చెరువులు, వాగులు, వంకలు అన్ని నిండు కుండలను తలపిస్తున్నాయి. అయినా వరుణుడు శాంతించడం లేదు. ఉపరితల ఆవర్తన... Read more
Aug 06 | ప్రముఖ ఫుడ్ ఆర్డరింగ్ యాప్ జొమాటో డెలివరీ బాయ్ గా ఏడేళ్ల బాలుడు ఇంటింటికీ డెలివరీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ మిట్టల్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను... Read more
Aug 06 | మధుమేహం.. షుగర్.. ఎలా పిలిచినా ఒకసారి దాని బారిన పడ్డామంటే జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక్క మందులే కాదు.. ఆహారం విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో జనరల్ ఎలక్ట్రిక్... Read more