దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అత్యంత వేగంగా స్పందించిన పైలట్లు వెనువెంటనే తీసుకున్న చర్యలతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రయాణికులతో పాటు క్యాబిన్ క్రూ అంతా సురక్షితంగా కిందకు దిగడంతో విమానయాన అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో ఉన్నంత సేపు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కూర్చున్న ప్రయాణికులు కూడా హమ్మాయ్య అని ఊరటపోందారు. అయితే ఈ ప్రమాదం నేలపై ఉన్నప్పుడో లేక రన్ వే పై వెళ్తున్న సమయంలోనో సంభవించింది కాదు.
గగనతలంలో ఏకంగా 5000 అడుగుల ఎత్తులో ఉండగా క్యాబిన్ నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. స్పైస్‌జెట్ అధికార ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఉదయం ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఓ స్పైస్‌జెట్ విమానం మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్ది సేపటి తర్వాత విమానం 5వేల అడుగుల ఎత్తులో ఉండగా క్యాబిన్లో పొగలు రావడాన్ని క్రూ సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయానికి మళ్లించారు.
విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, ప్రయాణికులను క్షేమంగా దించేసినట్లు స్పైస్ జెట్ విమానయాన సంస్థ అధికారులు తెలిపారు. క్యాబిన్లో పొగలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతోన్న వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఘటనకు గల కారణాలేంటీ? విమానంలో ఎంతమంది ఉన్నారన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. గత కొన్ని రోజులుగా స్పైస్‌జెట్ విమానాల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటం గమనార్హం. గత నెల 19న దిల్లీకి బయల్దేరిన ఓ విమానం ఇంజిన్‌లో మంటలు రావడంతో దాన్ని అత్యవసరంగా పట్నాలో దించేశారు.
#WATCH | A SpiceJet aircraft operating from Delhi to Jabalpur returned safely to the Delhi airport today morning after the crew noticed smoke in the cabin while passing 5000ft; passengers safely disembarked: SpiceJet Spokesperson pic.twitter.com/R1LwAVO4Mk
— ANI (@ANI) July 2, 2022
(And get your daily news straight to your inbox)
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more
Aug 08 | ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలోగల సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌజింగ్ సొసైటీలో ఓ మహిళతో అనుచితంగా వ్యవహరించిన స్థానిక బీజేపీ కార్యకర్త.. పోలీసుల రంగప్రవేశంలో పరార్ అయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు... Read more
Aug 08 | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్ల ప్రకటించారు.... Read more
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more