Pahandi rituals for Jagannath Rath Yatra begin in Puri జగన్నాథుని రథయాత్ర వేడుకులు ప్రారంభం..

Puri rath yatra holy trinity placed atop chariots after pahandi prez pm greet people

bhagwan jagannath rath yatra 2022, jagannath rath yatra update, rath yatra 2022, rath yatra, bhagwan jagannath rath yatra, bhagwan jagannath rath yatra 2022, odisha, pahandi rituals, jagannath rath yatra begin, puri rath yatra, odisha, pahandi rituals, jagannath rath yatra begin, puri jagannath rath yatra, covid pandemic

After a Covid hiatus of two years, the 145th Lord Jagannath Rath Yatra commenced today in Odisha's Puri with thousands of devotees participating in the Jagannath Rath Yatra festivities.The annual Rath Yatra of the holy trinity- Lord Balabhadra, Devi Subhadra and Lord Jagannath is taking place with full public participation and will conclude next week on July 9.

జగన్నాథుని రథయాత్ర వేడుకులు ప్రారంభం.. పూరీలో భక్తుల కోలాహలం

Posted: 07/01/2022 11:47 AM IST
Puri rath yatra holy trinity placed atop chariots after pahandi prez pm greet people

దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర వేడుకలు ఇవాళ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొమ్మిది రోజలు పాటు భక్తుల కోలాహలం మధ్య అత్యంత వైభవోపేతంగా ఈ వేడుకలు జరగనున్నాయి. పూరీ జగన్నాథుడి రథయాత్రను వీక్షించడమే మహాద్భాగ్యం అని భావించే భక్తులు పెద్ద సంఖ్యలో ఒడిశా పూరీకి చేరుకున్నారు. దీంతో పూరీ ఆలయ వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జగన్నాథ రథయాత్ర తిలకించేందుకు వచ్చిన భక్తజనానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లను చేశారు.

ఒడిశా పూరీలో జగన్నాథ రథయాత్ర.. శుక్రవారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమైంది. జగన్నాథ రథచక్రాలను చూసేందుకు.. వేలాది మంది భక్తులు పూరీ చేరుకున్నారు. భక్తుల కోలాహలంతో పూరీ వీధులు సందడిగా మారిపోయాయి. జగన్నాథుడు, దేవీ సుభద్ర, బాలభద్రల ఊరేగింపు.. రథంపై పూరీ వీధుల్లో జరుగుంది. ప్రతి యేటా.. జూన్​/జులైలోని శుక్ల పక్షంలోని రెండో రోజు ఈ పండుగ జరుగుంది. ఈ ఏడాది జులై 1న జగన్నాథుని రథయాత్ర మొదలైంది. ప్రతియేటా కొత్తగా జగన్నాథ రథాన్ని నిర్మాణిస్తారు. ఈ ఏడాది ఈ పనులు కొన్ని రోజుల క్రితమే పూర్తి అయ్యాయి.

కొవిడ్​ మహమ్మారి కారణంగా రెండేళ్లుగా భక్తులు లేకుండానే జగన్నాథ రథయాత్ర జరిగింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో భక్తులకు ఈసారి అనుమతులు లభించాయి. దీంతో భక్తులు ఈ సారి జగన్నాథ రధోత్సవ వేడుకలను తిలికించేందుకు పెద్దసంఖ్యలో రానున్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. అటు ఆలయ రథోత్సవం నేపథ్యంలోనూ.. ఇటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాలను సైతం ఎక్కడిక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదనపు బలగాలను సైతం అధికారులు సిద్ధం చేశారు.

జగన్నాథ రథయాత్ర సందర్భంగా దేశప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. "జగన్నాథుని రథయాత్ర నేపథ్యంలో దేశ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. విష్ణుమూర్తి అవతారంగా భావించే జగన్నాథుడికి రథయాత్ర జరుగుతోంది. సమాజంలోని ప్రజలు ఒక్కటిగా చేరి జగన్నాథుని రథచక్రాలను విక్షిస్తారు. రథయాత్రతో మీ జీవితాల్లో శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను," అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఇక దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఒడిశా తర్వాత గుజరాత్​లో ఈ వేడుకలు ఘనంగా సాగుతాయి. కాగా.. అహ్మదాబాద్​లోని శ్రీ జగన్నాథ మందిరంలో జరిగిన రథయాత్రలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్​ పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles