తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. అయితే ఇంటర్ ఫలితాల్లో యధావిధిగా బాలికలదే సత్తాచాటారు. ఇంటర్ సెకండియర్‌లో మొత్తం 4,63,370 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వారిలో 2,95,949 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇక వీరిలో 1,59,422 మంది విద్యార్థులు ఏ గ్రేడ్ సాధించగా, 82,481 మంది విద్యార్థులు బి గ్రేడ్ సాధించారని తెలిపారు. మొత్తంగా 67.82 శాతం మంది విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు.
2,16,389 మంది 1,64,172 మంది ఉత్తీర్ణత సాధించగా, 75.86 శాతం మంది బాలికలు పరీక్షలలో ఉత్తర్ణులయ్యారని తెలిపారు. ఇక అదే విధంగా ఇంటర్ సెకండియర్లో 2,19,981 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 1,32,771 మంది విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షలలో 60 శాతం మంది బాలురు ఉత్తర్ణీత సాదించారని మంత్రి తెలిపారు. ఇంటర్ పరీక్షల్లో జిల్లాల వారీగా పరిశీలిస్తే 78శాతంతో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అగ్రస్థానంలో నిలువగా, సెకండ్ ఫ్లేస్ లో 77శాతం ఉత్తీర్ణతతో కుమరంభీమ్ అసిఫాబాద్ జిల్లా నిలిచిందని మంత్రి తెలిపారు.
ఇంటర్ ఫస్టియర్ లో 4,64,892 మంది విద్యార్థులు పరీక్షలకు రాయగా, 2,94,378 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా, 1.93,925 మంది ఏ గ్రేడ్ సాధించగా, బి గ్రేడ్ సాధించిన విద్యార్ధులు 63,501 మంది విద్యార్థులు ఉన్నారని మంత్రి తెలిపారు. 63.32 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఇక తొలి సంవత్సర పరీక్షలకు 2,33,210 పరీక్షలకు హాజరుకాగా, 1,68,692 మంది 72.33శాతం ఉత్తర్ణత సాధించారని తెలిపారు. ఇక ఫస్టియర్ లో 2,31,682 మంది బాలురు పరీక్షలకు హాజరయ్యారని వారిలో 1,25,686 మంది బాలురు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. మొత్తంగా బాలురలో ఫస్టియర్ పరీక్షలలో 54.55 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఇక జిల్లాల వారీగా ఉత్తీర్ణత పరిశీలిస్తే.. తొలి స్థానంలో 76శాతంతో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నిలిచిందని తెలిపారు. రెండవస్థానంలో హన్మకొంగ 74శాతంతో ముందుందని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కరోనా వల్ల గడిచిచిన రెండేళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. విద్యార్థులకు నష్టం జరగకుండా ఆన్‌లైన్‌లో బోధన చేశాం. గతేడాది 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహించామని చెప్పారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు కౌన్సెలింగ్‌లు కూడా నిర్వహించామని పేర్కొన్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తాం. ఈ నెల 30 నుంచి పరీక్ష ఫీజు స్వీకరిస్తాం. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కూడా అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు. ఆగస్టు చివరి నాటికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేస్తామని సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more
Aug 08 | ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలోగల సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌజింగ్ సొసైటీలో ఓ మహిళతో అనుచితంగా వ్యవహరించిన స్థానిక బీజేపీ కార్యకర్త.. పోలీసుల రంగప్రవేశంలో పరార్ అయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు... Read more
Aug 08 | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్ల ప్రకటించారు.... Read more
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more