Paderu Excise police seize scorpio vehicles smuggling weed ‘పుష్ఫ’ చిత్రం తరహాలో స్మగర్ల అక్రమరవాణ.. తగ్గదే లే అన్న పోలీసులు

Smugglers follow cinematic tricks paderu excise police seize scorpio vehicles

excise and enforce department seized two Scorpio vehicles smuggled ganja in paderu, excise department seized two Scorpio vehicles smuggled ganja in paderu, excise department seized two Scorpio vehicles in paderu, two Scorpio vehicles seized in paderu, two Scorpio vehicles, Ganja, excise department, Paderu, Delhi Registration vehicles, Alluri sitaramaraju district, Andhra Pradesh, Crime

The Andhra Pradesh Excise and Enforcement department officials seized two Scorpio vehicles smuggled ganja in Paderu Mandal of Alluri sitaramaraju district of AP, worth of Rs 2 crores.

‘పుష్ఫ’ చిత్రం తరహాలో స్మగర్ల అక్రమరవాణ.. తగ్గదే లే అన్న పోలీసులు

Posted: 06/25/2022 07:59 PM IST
Smugglers follow cinematic tricks paderu excise police seize scorpio vehicles

‘పుష్ప’ సినిమాతో పాటు ఇప్పటికే పలు సినిమాల్లోనూ పోలీసుల కళ్లు గప్పి అక్రమార్గాలల్లో ఎలా సరుకు రవాణా చేయాలో అన్నది ఒక్కో దర్శకుడు ఒక్కో వినూత్న మార్గాన్ని చూపించారు. అయితే ఆ మార్గాలను అన్వయించుకుని, కొత్త కొత్త పద్దతుల ద్వారా అక్రమరవాణ చేస్తున్న రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్మగర్లు అచరిస్తున్న అక్రమ మార్గాలను అద్యాయనం చేస్తున్న పోలీసులు కూడా ఎప్పుటికప్పుడు వారి అక్రమాలకు చెక్ పెడుతున్నారు. అందుకు ఈ ఘటనే ఉదాహరణ.  అయితే ఇక్కడ అక్రమార్కులు తరలిస్తున్నది ఎర్ర చందనం కాదు.

ఎర్రచందనంతో జాతీయ సంపద తరలి విదేశాలకు పోతుంది. కానీ ఈ అక్రమార్కులు తరలించే సరుకు ఏకంగా మాదకద్రవ్యం. దీంతో దేశ అమూల్యమైన జాతీయ మానవ వనరు పనికిరాకుండా పోతుంది. సినీపక్కీలో వినూత్న పద్ధతి ద్వారా గంజాయిని తరలించే ప్రయత్నం చేసిన స్మగ్లర్లు.. కారు డోర్ల సందుల్లో పెట్టి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకోవాలని అనుకున్నారు. అయితే పోలీసులు వాటిని కూడా చెక్ చేయడంతో అడ్డంగా దొరికిపోయారు. ఫలితంగా గంజాయి రవాణా చేస్తున్న రెండు స్కార్పియో వాహనాలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు శివారులో జరిగింది.

గంజాయి తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు.. పాడేరు మండలం చింతలవీధి కూడలి వద్ద ఎక్సైజ్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో..ఢిల్లీ రిజిస్ట్రేషన్ నెంబర్​ కలిగిన రెండు స్కార్పియో వాహనాలు అటువైపుగా రాగా, వాటిని కూడా పోలీసులు తనిఖీలు చేపట్టారు. వాహనాలను జల్లెడ పట్టిన పోలీసులకు ఏమీ దొరకలేదు. అనుమానమోచ్చిన పోలీసులు.. స్మగ్లర్ల అతితెలివిని గ్రహించి చాకచక్యంగా మరోసారి తనిఖీ చేశారు. ఈసారి ఇట్టే దొరికిపోయాయి. స్మగ్లర్లు.. సినీఫక్కీలో డోర్ల మధ్య గంజాయి ప్యాకెట్లను దాచిపెట్టారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles