telangana orders govt teachers to declares assets every year ఉపాధ్యాయులు.. ఇక ప్రతీ ఏటా మీ ఆస్తుల చిట్టా సమర్పించాల్సిందే..!

Vigilance report on govt school hm in nalgonda behind circular for disclosure of assets by teachers

vigilance and enforcement Report, Head Master Mohd Javed Ali, Government Primary High School, Guntupally, State government, teachers' declaration of assets, government teachers assets declaration, Government teachers real estate business, Government teachers political activities, Government teachers, assets declaration, vigilence report, Mohd Javed Ali, HM, Primary school, Guntupally, Telangana, Politics

The inquiry of vigilance and enforcement department against Mohd Javed Ali, headmaster of Government Primary High School in Guntupally, prompted the State government to issue a circular declaration of assets of all government teachers. The enquiry began when there were allegations that Javed Ali was absenting himself from the duties and that he was involved in real estate business and political activities and the allegations were found to be true.

ఉపాధ్యాయులు.. ఇక ప్రతీ ఏటా మీ ఆస్తుల చిట్టా సమర్పించాల్సిందే..!

Posted: 06/25/2022 05:42 PM IST
Vigilance report on govt school hm in nalgonda behind circular for disclosure of assets by teachers

తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆస్తులపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని కొందరు ఉద్యోగులు తమ విధులకుహాజరుకాకుండా.. ఆయా స్థానాల్లో ఎవరో ఒకర్ని తమలా నటింపజేస్తూ.. వారు మాత్రం తమ ఇతర వ్యవహారాలను చక్కబెడుతున్నారన్న అరోపణలు అధికమయ్యాయి. దీంతో ప్రభుత్వం ఉపాధ్యయులపై ఆంక్షలను కట్టుదిట్టం చేసింది. ఇకపై విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. స్థిర, చరాస్తుల క్రయవిక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.

అసలేం జరిగిందీ.. ప్రభుత్వం ఇంత అఘమేఘాలమీద ఇలాంటి ఉత్తర్వులు ఎందుకు అమల్లోకి తీసుకువచ్చిందీ అంటే.. నల్గొండ జిల్లా చందంపేట మండలం గుంటిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహమ్మద్‌ జావేద్‌అలీ విధులకు హాజరుకాకుండా రాజకీయ కార్యకలాపాలు, స్థిరాస్తి వ్యాపారాలు, వక్ఫ్‌బోర్డు సెటిల్‌మెంట్లలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ.. నాలుగు చేతులా అర్జిస్తున్నారని 2021లో ఆరోపణలు వచ్చాయి. విచారణ జరిపిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం.. జావేద్‌ అలీపై వచ్చిన ఆరోపణల్లో చాలా వరకు నిజమేనని తేల్చింది.

శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిఫార్స్‌ చేసింది. జావేద్‌ అలీపై చర్యలతో పాటు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉద్యోగులందరికీ సంబంధించి ఉత్తర్వులు ఇవ్వాలని గతేడాది ఏప్రిల్‌లో విజిలెన్స్‌ విభాగం సిఫార్స్‌ చేసింది. సిబ్బందికి బయోమెట్రిక్‌ హాజరు ఉండాలని సూచించింది. సిబ్బంది ఏటా ఆస్తుల వివరాలు సమర్పించడంతో పాటు, స్థిర..చరాస్తి క్రయ విక్రయాలకు ముందస్తు అనుమతి పొందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం సిఫార్సు మేరకు పాఠశాల విద్యాశాఖ  ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles