దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్లు వచ్చేనెల 10 వరకు అందుబాటులో ఉంటాయి. మొత్తం 210 పోస్టులను భర్తీ చేస్తున్నది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 210
అర్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
కంప్యూటర్‌లో ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు టేప్ చేయగలగాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి: అభ్యర్థులు 18 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.
సుప్రీంకోర్టు జూనియర్ అసిస్టెంట్ 2022 వేతనం వివరాలు
* పే మ్యాట్రిక్స్ 6వ స్థాయి వేతనం వీరికి లభిస్తుంది. కాగా వీరి బేసిక్ రూ. 35,400/-.
* హెచ్‌ఆర్‌ఏతో సహా ప్రస్తుత భత్యాల రేటు ప్రకారం సుమారుగా గ్రాస్ వేతనం రూ. 63068/-
ఎంపిక ప్రక్రియ: ఐదు అంచెల పరీక్షా విధానం.
స్టేజ్ 1: ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నాపత్రం బహుళ ఎంపిక సమాధానాలతో 100 ప్రశ్నలను కలిగి ఉంటుంది (50 జనరల్ ఇంగ్లిష్ ప్రశ్నలతో సహా కాంప్రహెన్షన్ విభాగం, 25 జనరల్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు మరియు 25 జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఉంటాయి). పరీక్ష వ్యవధి 2 గంటలు. 1/4 మార్కులకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
స్టేజ్ 2: ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ (25 ప్రశ్నలు)
స్టేజ్ 3:కనిష్ట వేగం 35 w.p.mతో కంప్యూటర్‌లో టైపింగ్ (ఇంగ్లీష్) పరీక్ష. తప్పుల తగ్గింపు తర్వాత (తప్పులు అనుమతి 3%) 10 నిమిషాలు
స్టేజ్ 4: వివరణాత్మక పరీక్ష (ఇంగ్లీష్ భాషలో) కాంప్రహెన్షన్ పాసేజ్, ప్రెసిస్ రైటింగ్ మరియు ఎస్సే రైటింగ్
స్టేజ్ 5: ఇంటర్వ్యూ తేదీ,
ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్థులు మెరెట్ ప్రకారం జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ గా నియమించబడతారు.
రాతపరీక్ష, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లిష్ టైపింగ్ పరీక్ష
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీహెచ్ అభ్యర్థులకు రూ.250
దరఖాస్తులకు చివరితేదీ: జులై 10
వెబ్‌సైట్: www.sci.gov.in/ లలో లాగిన్ కాగలరు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more
Aug 08 | ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలోగల సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌజింగ్ సొసైటీలో ఓ మహిళతో అనుచితంగా వ్యవహరించిన స్థానిక బీజేపీ కార్యకర్త.. పోలీసుల రంగప్రవేశంలో పరార్ అయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు... Read more
Aug 08 | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్ల ప్రకటించారు.... Read more
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more