Researchers Repair and Regenerate Heart Muscle Cells గుండెను రిపేర్ చేసే టెక్నాలజీ కనుగోన్న వైద్యపరిశోధకులు

University of houston biochemistry researchers repair and regenerate heart muscle cells

Stem Cells; Heart Disease, Stroke Prevention, Vioxx, Stroke, Neuroscience; Dementia, Heart Disease, What is Heart Disease, Heart Disease treatment, Heart Disease symptoms, What is cardiac arrest, Heart Disease precautions, Heart blockages Treatment, Heart blockage Treatment, Heart repair, Heart regenerate, houston scientists, Heart repair, Medical Research, Doctors, Heart regenerate, houston scientists, Science News, Health NewsScience News, Health News

Researchers at the University of Houston are reporting a first-of-its-kind technology that not only repairs heart muscle cells in mice but also regenerates them following a heart attack, or myocardial infarction as its medically known. Published in the Journal of Cardiovascular Aging, the groundbreaking finding has the potential to become a powerful clinical strategy for treating heart disease in humans.

గుండెకు మరమ్మతులు చేసే టెక్నాలజీ.! వైద్యుల అరుదైన పరిశోధన!.

Posted: 06/23/2022 03:17 PM IST
University of houston biochemistry researchers repair and regenerate heart muscle cells

మానవ అవయవాల్లో గుండె చాలా ప్రధానమైంది. మావన దేహంలోని రక్తాన్ని శుద్ది చేసిన తిరిగి దేహంలోని అన్ని అవయవాలకు పంపుతుంది. ఈ కాలక్రమంలో గుండెకు చేరే రక్తం చిక్కబడినా.. లేక గుండెలోని రక్తనాళాల్లో కొవ్వు చేరి రక్తం సరిగ్గా సరఫరా కాకుండా చేసినా.. వాటి వల్ల తీవ్రమైన అనారోగ్యం ఏర్పడవచ్చు. ఒక్క సమయంలో అకస్మిక మరణాలు కూడా సంభవించవచ్చు. దానినే గుండెపోటు అని కూడా అంటాం. అందుకనే గుండెను చాలా అరోగ్యంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.

ఇక గుండె అరోగ్యం మెరుగ్గా ఉండాలంటే రోజుకు కనీసం 45 నిమిషాల పాటు నడక తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. ఇక గుండెకు ఏదైనా జబ్బు వస్తే ఆ తర్వాత జీవితం అంతా గాజుబొమ్మలాగే బతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గుండెకు ఎలాంటి ప్రమాదం రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ మిగిలిన జీవితం అంతా సున్నితంగా మార్చేసుకోవాలి. అయితే ఈ రకమైన పరిస్థితులు ఇకపై తలెత్తవు. మరీ ముఖ్యంగా గుండెపోటు వచ్చిన తరువాత గుండె ఒడిదోడుకులకు గురువుతుందని.. ఈ క్రమంలో కొన్ని కణాలు కూడా దెబ్బతింటాయని.. కార్డియో సర్జన్లు చెబుతుంటారు.

అందుచేత గుండె నాళాలు బ్లాక్ అయినా.. లేక గుండెపోటు వచ్చిన రోగులు శస్త్రచికిత్స తరువాత తగు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమని వైద్యులు చెబుతుంటారు. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనతో ఈ పరిస్థితి మారనుంది. గుండెను రిపేర్ చేసే టెక్నాలజీని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. గుండెను రిపేరు చేయడంతో పాటు రీజనరేట్ ప్రక్రియను వేగవంతం చేసే టెక్నాలజీని యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‌కు చెందిన పరిశోధకులు కనుగోన్నారు. సింథటిక్ మెసెంజర్ రిబోన్యూక్లియక్ యాసిడ్ (ఎంఆర్‌ఎన్ఏ) ద్వారా ఒక ఎలుక హృదయంలోకి కొన్ని మ్యుటేట్ అయిన ట్రాన్‌స్క్రిప్షన్ కారకాలను పంపారు.

ఇవి డీఎన్‌ఏ.. ఆర్‌ఎన్‌ఏగా మారే ప్రక్రియను కంట్రోల్ చేసే ప్రొటీన్లు. ఇలా మ్యుటేట్ చేసిన స్టెమిన్, వైఏపీ5ఎస్ఏ కారకాలు కలిసి హృదయంలోని కణాలు వేగంగా రెట్టింపు అవడానికి దోహదపడతాయి. దీంతో గుండె వేగంగా రిపేర్ అవుతుంది. తాము పంపే ఈ కారకాల వల్ల హృదయం రిపేర్ అయ్యే వేగం చాలా రెట్లు పెరుగుతోందని చెప్పిన శాస్త్రవేత్తలు.. కేవలం 24 గంటల్లోనే 15 రెట్ల వేగాన్ని పరిశీలించినట్లు చెప్పారు. మరో పరిశోధనలో హృదయంలో దెబ్బతిన్న ప్రాంతాన్ని ఈ కారకాలు రిపేర్ చేయడాన్ని కూడా పరిశోధకులు గుర్తించినట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles