మహారాష్ట్రలోని సంకీర్ణ సర్కారును కూలదోయడానికి ప్రయత్నిస్తున్న శివసేన పార్టీ కీలక నేత, రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఏక్నాథ్ షిండేను ఇవాళ్టి మధ్యాహ్నం వరకు పోగిడిన రాజకీయ విశ్లేషకులు.. ఆ తరువాత ఆయన ఏం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఇక స్వయంగా ఏక్నాథ్ షిండే మీడియా కంటపడ్డటంతో ఆయన అక్కడ వ్యవహరించిన తీరు.. తనను నమ్మివచ్చిన ఎమ్మెల్యేల పరిస్థితి.. వారికి అష్టదిక్కులా పోలీసుల వలయం ఏర్పడటం అంతా నిశితంగా గమనించారు. పోలీసులతో ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించారా? లేక పోలిసుల సహకారంతో ఎమ్మెల్యేలను అపహరించారా.? అన్న ఆరోపణలు గుప్పుమన్నాయి.
గుజరాత్‌లోని సూరత్ విమానాశ్రయంలో ఏక్నాథ్ షిండే మీడియాకు చిక్కారు. తమ మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి అసోంలోని గువాహటికి వెళుతుండగా వారిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. గుజరాత్ పోలీసులు, కేంద్రబలగాలు ఎమ్మెల్యేలకు రక్షణగా నిలిచాయి. వారిలో ఏఒక్కరూ మీడియాతో నోరు తెరువలేదు. నో కామెంట్స్ అంటూ వెళ్లారు. ఏక్నాథ్ షిండేతో సహా ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు మీడియా విఫలయత్నం చేసింది. దీంతో తప్పించుకునేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు పరుగందుకున్నారు. అయితే తమకు మెజారిటీ ఉందని ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం.
గుజరాత్ లోని సూరత్ విమానాశ్రయంలో మహారాష్ట్రకు చెందిన శివసేన ఎమ్మెల్యేలను సూరత్ నుంచి గౌహతికి తరలిస్తున్న విధానంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యేలను తమ గూటికి వచ్చేందుకు వారికి ఆశ పెట్టే పద్దతులు పోయి.. అపహరించే పధ్దతులు వచ్చాయంటూ రాజకీయ విశ్వేషకులు విమర్శలు సంధించారు. శివసేన ఎమ్మెల్యేలను గొర్రెల మందను తరలించినట్టుగా సూరత్ విమానాశ్రయం నుంచి గుజరాత్ పోలీసులు తరలించారని ప్రముఖ న్యాయవాది, హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. ఎన్డీటీవీ ట్వీట్ చేసిన వీడియోను షేర్ చేస్తూ ఈ కామెంట్ చేశారు.
ఇక శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఒకరు మనసు మార్చుకుని సూరత్ హోటల్ నుండి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడని సీనియర్ జర్నలిస్ట్ స్వాతి చతుర్వేది ట్వీట్ చేశారు. అతడిని దాడి చేయాలని ఇతర ఎమ్మెల్యేలను ఏక్నాథ్ షిండే ఉసిగొల్పారని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన గుజరాత్ పోలీసుల రక్షణలో ఆసుపత్రిలో ఉన్నారని పేర్కొన్నారు. స్వాతి చతుర్వేది ట్వీట్‌పై ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ.. మహారాష్ట్ర ఎమ్మెల్యేలను సూరత్ హోటల్లో బంధించడం కిడ్నాప్ కంటే తక్కువేమీ కాదని వ్యాఖ్యానించారు. అధికార క్రీడలో ఎమ్మెల్యేలు అమ్ముడుపోడమే కాదు.. అపహరణకూ గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Gujarat Police herding the Maharashtra Shivsena MLAs like sheep at Surat airport! https://t.co/Kts1SbzoJL
— Prashant Bhushan (@pbhushan1) June 22, 2022
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more