Telugu must for CBSE, ICSE, IC schools in Telangana తెలంగాణలోని అన్ని పాఠశాలలో ఇక తెలుగు తప్పనిసరి.!

Telugu must as a second language paper for cbse icse ic schools in telangana

telugu mandatory in cbse till 10, telugu must as second language paper cbase icse, telugu compulsory language, telugu cbse icse ic, telugu must for class 10 students, telugu complusory cbse, telugu cbse class 10, telangana Schools, telugu, tenepalukulu, vennela, Classes I to X, CBSE, ICSE, IC, Mandatory, Telugu Language, Telangana

Starting this academic year, students of CBSE, ICSE, IB and other board-affiliated schools will have Telugu as a second language in Class X board exams. It has also been made mandatory for all schools, irrespective of affiliation to boards and medium of instruction, to teach Telugu as a language for all classes from this year.

తెలంగాణలోని అన్ని పాఠశాలలో ఇక తెలుగు తప్పనిసరి.!

Posted: 06/15/2022 02:58 PM IST
Telugu must as a second language paper for cbse icse ic schools in telangana

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఈ ఏడాది నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో తప్పనిసరిగా అమలుకానుంది. మాతృబాష కోసం ఇప్పటికే ఎదిగిన తరాలను ఏమీ చేయలేమని అయితే రానున్న తరాలను మాత్రం మాతృబాషకు దెగ్గరగా ఉంచేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఈ దిశగా చేపట్టిన చర్యల్లో ఈ ఏడాది నుంచి 1 నుంచి పదవ తరగతి వరకు అన్ని తరగతుల్లో తెలుగును తప్పనిసరి చేసింది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ సహా ఏ ఇతర బోర్డులకు అనుబంధమైన పాఠశాలలైనా తెలుగును ద్వితీయ భాష‌గా త‌ప్ప‌నిస‌రిగా బోధించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీచేసింది.

బోర్డులు, బోధనా మాధ్యమంతో సంబంధం లేకుండా తెలుగును బోధించాల‌ని ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2018-19 నుంచి దశలవారీగా తెలంగాణ (పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి బోధన, అభ్యాసం) చట్టం 2018 అమల్లో భాగంగా ఈ నిర్ణ‌యం తీసుకుంది. భావి తరాలకు ఉపయోగపడేలా తెలుగు భాష, సాహిత్యాన్ని పరిరక్షించేందుకు అన్ని పాఠ‌శాల‌ల్లో మాతృభాష‌ను త‌ప్ప‌నిస‌రి చేశారు. గత విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఒక‌టి నుంచి తొమ్మిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు తెలుగు భాష బోధ‌న‌ను త‌ప్ప‌నిస‌రి చేశారు.

ఈ విద్యాసంవత్సరం అంటే 2022-23లో అన్ని పాఠశాలల్లో 1-10వ తరగతి వరకు తెలుగును ఒక భాషగా అమలు చేస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తెలుగు మాతృభాష కాని పిల్ల‌ల కోసం 1-5వ త‌ర‌గ‌తి వరకు ‘తేనెపలుకులు’, 6 -10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ‘వెన్నెల’ పేరుతో పాఠ్యపుస్తకాలను రూపొందించారు. తెలుగు మాతృభాష‌గ‌ల విద్యార్థుల కోసం ప్రామాణిక పాఠ్య‌పుస్త‌కాల‌ను అందుబాటులో ఉంచారు. 1-5వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ‘జాబిలి’, 6,7,8 త‌ర‌గ‌తుల కోసం ‘న‌వ వ‌సంతం’, 9,10వ త‌ర‌గ‌తులకు ‘సింగిడి’ పేరుతో పుస్త‌కాల‌ను రూపొందించారు.

ఈ పుస్త‌కాలు రాష్ట్ర విద్యా ప‌రిశోధ‌న‌, శిక్ష‌ణా మండ‌లి ఎస్సీఈఆర్టీ వెబ్‌సైట్ http://scert.telangana.gov.in లో అందుబాటులో ఉంచారు. వివిధ బోర్డులకు అనుబంధంగా ఉన్న అన్ని పాఠశాలలు తెలుగు బోధించేందుకు ఉపాధ్యాయులను నియమించడంతోపాటు ఎస్సీఈఆర్టీ రూపొందించిన పాఠ్యపుస్తకాలను అనుసరించాలని పాఠ‌శాల విద్యాశాఖ‌ ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని, తప్పు చేసిన యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీచేస్తామ‌ని, జరిమానా విధించ‌డం లేదా గుర్తింపు ర‌ద్దుచేయ‌డంలాంటి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana Schools  telugu  tenepalukulu  vennela  Classes I to X  CBSE  ICSE  IC  Mandatory  Telugu Language  Telangana  

Other Articles