New LPG gas connection gets expensive! వంటగ్యాస్ సిలిండర్ డిపాజిట్ మొత్తం భారీగా పెంపు

New lpg gas connection gets expensive you will have to pay more now

LPG Gas Connection, LPG, Liquefied Petroleum Gas, Gas Cylinder, LPG Cylinder,LPG Gas Connection, LPG, Liquefied petroleum gas, gas cylinder, LPG cylinder, LPG domestic Cylinder, deposit price, oil companies, LPG cylinder deposit price, deposit price hiked, Indane, Hindusthan, Bharat

If you’re planning to take a new gas connection, you will now have to shell out more money, as oil marketing companies (OMCs) have increased the security of new cylinders. The new rates are effective June 16, 2022. The latest move could be another setback for the common man who is already faced with high LPG prices and petrol and diesel rates.

కొత్త ఎల్సీజీ గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారా.? మీకు చేధువార్త..

Posted: 06/15/2022 01:15 PM IST
New lpg gas connection gets expensive you will have to pay more now

సామాన్యులపై ఇప్పటికే బారం మోపుతూ.. సిలిండర్ పై నాలుగు వందల మేర లభించిన సబ్సీడీని కేవలం 200 వరకు పరిమితం చేసి.. కరోనా కష్టకాలం నుంచి దానిని మరింతగా తగ్గించి కేవలం నలబై రూపాయలకు మాత్రమే లబ్దిదారుల బ్యాంకు అకౌంట్లలో వేసిన కేంద్రప్రభుత్వం.. ఇటీవల ఆ సబ్సీడీని కూడా ఎత్తివేసింది, దీంతో సామాన్యులపై మరింత భారం పడింది. కేవలం అంత్యోదయ లబ్దిదారులకు మాత్రమే రాయితీని కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

అలవాటు పడేవరకు ఒకలా.. దానికే అలవాటు పడిన తరువాత మరోలా వ్యవహరించే బ్రీటీషు వారి సంప్రదాయాన్ని అయిల్ కంపెనీలు కూడా ఆచరించడంపై ఇప్పటికే సామాన్య, మధ్యతరగతి ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఈ తరుణంలో మరో పిడుగులాంటి నిర్ణయం తీసుకున్నాయి అయిల్ కంపెనీలు. ఇన్నాళ్లు గ్యాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. ఇక తాజాగా, గ్యాస్ సిలిండర్ డిపాజిట్ ధరలను కూడా భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకన్నాయి. కొత్తగా వంటగ్యాస్ కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి ఇది చేదువార్తే.

ప్రస్తుతం ఉన్న డిపాజిట్ మొత్తాన్ని భారీగా పెంచుతూ ఇంధన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ డిపాజిట్ ప్రస్తుతం రూ. 1,450 ఉండగా దానిని రూ. 2,200కు పెంచారు. ఐదు కిలోల సిలిండర్ డిపాజిట్‌ను రూ. 800 నుంచి రూ. 1,150కి పెంచుతున్నట్టు ఇంధన సంస్థలు ప్రకటించాయి. ఇకపై, రెగ్యులేటర్‌కు కూడా రూ. 250 వసూలు చేస్తారు. పెంచిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ఇంధన సంస్థలు తెలిపాయి. ఉజ్వల యోజన వినియోగదారులకు ఈ ధరలు వర్తించవని, కొత్త కనెక్షన్ తీసుకునే వారే కొత్త ధరలను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles