Pizza Chain Employee Thrashed By 4 Women In Madhya Pradesh చాడీలు చెప్తోందని అరోపణ.. నడిరోడ్డు మీద యువతిపై కర్రలతో దాడి

Domino s pizza female employee gets brutally thrashed by a group of women in indore

Viral Video, Domios Girl, Viral News, Viral Indore, Viral Indore News, india social media news, Social media news, Twitter, ,Viral video, Domios Girl, Viral news, Viral Indore, Viral Indore News, hooligans, horrifying video, social media, employee, Twitter, Indore, Madhya Pradesh, viral video, india social media news

In a horrifying incident, a young female Dominos employee was brutally beaten up on the streets by a group of 4 women. The incident took place in Indore, Madhya Pradesh. The girl can be seen crying in pain but nobody seems to help her.

ITEMVIDEOS: చాడీలు చెప్తోందని అరోపణ.. నడిరోడ్డు మీద యువతిపై కర్రలతో దాడి

Posted: 06/14/2022 09:35 PM IST
Domino s pizza female employee gets brutally thrashed by a group of women in indore

సోషల్‌ మీడియాను మరో షాకింగ్‌ ఘటన కుదిపేస్తోంది. ఓ అమ్మాయిని మరో అమ్మాయిల గుంపు చితకబాదిన వీడియో అది. పిజ్జా ఔట్‌లెట్‌లో పని చేస్తున్న ఆ అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే బాదారు వాళ్లు. ఆ టైంలో ఎవరూ వాళ్లను అడ్డుకోకపోవడం విశేషం. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ ద్వారకాపూరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తాజాగా ఈ షాకింగ్‌ ఘటన జరిగింది. నందినీ యాదవ్‌ అనే అమ్మాయి డోమినోస్‌ డెలివరీ గర్ల్‌గా పని చేస్తోంది. శనివారం విధుల కోసం వెళ్తున్న ఆమెను నలుగురు అమ్మాయిలు అడ్డగించి.. వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా ఆపై నందినిపై ఇష్టమొచ్చినట్లు దాడి చేశారు.

చేతులతో కాదు ఏకంగా చేతిలోకి కర్రలు తీసుకుని మరీ దాడి చేశారు. ఎందుకు దాడి చేస్తున్నారని చుట్టుపక్కల వాళ్లు ప్రశ్నించడంతో.. తమపై చాడీలు చెప్తోందని సమాధానం ఇచ్చారు. వాళ్ల కోపాన్ని చూసి.. స్థానికులెవరూ అడ్డగించే ప్రయత్నమూ చేయలేదు. దీంతో మరింత రెచ్చిపోయి నందినీని కర్రలతోనూ చితకబాదారు. అయితే దారినపోయే కొందరు మాత్రం వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో.. ఇప్పుడు క్రేజీ వీడియోగా ఇది వైరల్‌ అవుతోంది. ఈ ఘటనపై బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వాళ్లంతా స్నేహితులే అని, ప్రధాన నిందితురాలు పింకీ కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Domios Girl  hooligans  horrifying video  social media  employee  Twitter  Indore  Madhya Pradesh  viral video  

Other Articles