హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా అభివృద్ది చెందుతున్న తరుణంలోనే.. మత్తుకు కూడా అడ్డాగా మారిందా? యువకులు మత్తుకు బానిసలు అవుతున్నారా? ఆ మత్తులో జోగుతూ వారు దారుణాలకు పాల్పడుతున్నారా? అంటే హైదరాబాద్ లో వరుసగా జరుగుతున్న ఘటనలతో అవుననే సమాధానమే వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలవమైంది. ఆ ఘటన వెలుగుచూసిన తర్వాత వరుసగా మైనర్ల అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి. అయినా మత్తుపదార్థాల సరఫరాపై పోలీసుల చర్యలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.
అందుకు వెలుగులోకి వచ్చిన తాజా వీడియోనే సాక్ష్యంగా నిలుస్తోంది. ఆసిఫ్‌నగర్‌లో పోలీసు వాహనంపైనే అర్ధరాత్రి యువకులు హల్చల్ చేశారు. గంజాయి తాగిన యువకులు.. మత్తులో రెచ్చిపోయారు. పోలీసులపైనే తిరగబడ్డారు. ఏకంగా పోలీసు వాహనంపైకి ఎక్కి వీరంగం వేశారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఏకంగా పోలీసు వాహనంపై ఉండే లైట్లపైనే అర్థనగ్నంగా కూర్చోని వీరంగం సృష్టించాడు. పోలీసులు కారును నడుపుతుండగా, యువకుడు రెండు చేతులు ఎత్తి.. అడ్డు వస్తున్న వాహనాలను పక్కకు జరగాల్సిందిగా కూడా బెదిరించాడు.
ఈ ఘటనపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ దృశ్యం మన హైదరాబాద్ లోనే అంటూ ఆ వీడియోను ట్వీట్ చేశారు. మత్తులో యువకులు పోలీసుల వాహనాన్నే ధ్వంసం చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయన్నారు. మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు దాటి.. పోలీసు వాహనాలపై దాడులు చేసే స్థాయికి పరిస్థితి వచ్చిందని రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. కేసీఆర్ పాలనకు ఇది నిదర్శనమన్నారు. ఈ హైదరాబాద్ నగరాన్ని.. ఈ పాలనను ఇలాగే వదిలేద్దామా..!? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో జరుగుతున్న దారుణాలపై పౌర సమాజం ఆలోచన చేయాలన్నారు రేవంత్ రెడ్డి.
ఈ దృశ్యం మన హైదరాబాద్ లోనే…
— Revanth Reddy (@revanth_anumula) June 14, 2022
ఆసిఫ్ నగర్ లో మందుబాబులు పోలీసు వాహనం ఎక్కి వీరంగం వేసి, వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు దాటి పోలీసు వాహనాలపై దాడులు చేసే స్థాయికి పరిస్థితి వచ్చింది.
ఈ నగరాన్ని… ఈ పాలనను ఇలాగే వదిలేద్దామా!? పౌర సమాజం ఆలోచన చెయ్యాలి. pic.twitter.com/jIHrYnBtZi
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more