Strawberry supermoon rises tonight ఖగోళంలో అద్భుతం.. నేటి రాత్రి సూపర్ మూన్ అవిష్కృతం.!

Supermoons return this summer starting with strawberry full moon

Supermoon, strawberry supermoon, strawberry full moon, months full moon, ancient European tradition, sweet name, moons orbit, what is strawberry supermoon, full moon, strawberry supermoon timing, strawberry supermoon india, strawberry supermoon pics, flower moon, what is supermoon, science news, Vat Purnima

After a total lunar eclipse, the Moon is set for another celestial event as the supermoon takes to the skies across the world on Tuesday. The full moon is known by different names across the world, including the Strawberry Supermoon, the Mead, Honey, or Rose Moon. In India, it's also called Vat Purnima. The full moon will rise along the eastern horizon at sunset, and set in the west near sunrise.

ఖగోళంలో అద్భుతం.. నేటి రాత్రి సూపర్ మూన్ అవిష్కృతం.!

Posted: 06/14/2022 11:54 AM IST
Supermoons return this summer starting with strawberry full moon

ఈ ఏడాది మే నెల పౌర్ణమి నాడు చందమామాను రాహువు మింగేసిన కారణంగా ఏర్పడిన సుదీర్ఘ చంద్రగ్రహణం (భారతదేశంలో కనిపించని) తరువాత రానున్న జూన్ పౌర్ణమి రోజునే ఖగోళంలో అద్భుతం అవిష్కృతం కానుంది. ఈ ఏడాది జూన్ 14న చంద్రుడు మరింత నిండుగా, మరింత ప్రకాశవంతంగా దర్శనమివ్వనున్నాడు. అదేంటి అంటే ప్రతీ పౌర్ణమి రోజున దర్శనమిచ్చే కన్నా కొంత పెద్దగా ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. ఈ పౌర్ణమిని జేష్ఠ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ్టి పున్నమి చంద్రుడికి పలు విశేషాలు, ప్రత్యేకతలు ఉన్నాయి.

అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పలు పేర్లతో ఈ పున్నమిని పిలుస్తారు. ఈ పౌర్ణమిని మన దేశంలో వట్ పౌర్ణిమగా పిలుస్తుండగా, పూర్ణ చంద్రుడిని ఫుల్ మూన్ అని, స్ట్రాబెర్రీ సూపర్ మూన్ అని, మెడ్, హనీ మూన్, రోజ్ మూన్ ఇలా పలు రకాల పేర్లతో పిలుస్తుంటారు. మన దగ్గర వ్రతపౌర్ణమి అని కూడా అంటారు. మంగళవారం, బుధవారాల్లో సాయంత్రం నుంచి పూర్ణచంద్రుడు దర్శనం ఇవ్వనున్నాడు. భూమికి అత్యంత సమీపంగా చంద్రుడు చేరువ అయినప్పుడు వచ్చే పౌర్ణమిని ఫుల్ మూని అని చెబుతుంటారు. ఆ సమయంలో భూమి నుంచి 3,63,000 కిలోమీటర్ల దూరంలో చంద్రుడు ఉంటాడు.

ఇంత దగ్గరగా వచ్చినప్పుడు చంద్రుడు మరింత ప్రకాశవంతంగా, పెద్ద సైజులో కనిపిస్తాడు. సాధారణ పౌర్ణమి రోజుల్లో కనిపించే పరిమాణంతో పోలిస్తే ఫుల్ మూన్ రోజు కనిపించే చంద్రుడి ఆకారం మరింత పెద్దగా ఉంటుంది. భూమికి 4,05,000 కిలోమీటర్ల దూరానికి చంద్రుడు వెళ్లినప్పుడు దాన్ని దూరంగా పరిగణిస్తుంటారు. నాసా ప్రకారం, చంద్రుడు భూమి సమీప బిందువు, పెరిజీ వద్దకు చేరుకున్న తరుణంలో సగటున 3,63,300 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. పెరిజీ వద్ద పౌర్ణమి కనిపించినప్పుడు అది సాధారణ పౌర్ణమి కంటే కొంచెం పెద్దగా, ప్రకాశవంతంగా ఉంటుంది.

అమెరికా ఈశాన్య ప్రాంతంలో నివసించే గిరిజన తెగలు ఈ కాలంలో స్ట్రాబెర్రీలను పండిస్తుంటారు. అందుకే దీనికి స్ట్రాబెర్రీ సూపర్ మూన్ అనే పేరు వచ్చింది. యూరోప్ ప్రాంతంలో దీన్నే హానీమూన్  అంటుంటారు. జూన్ చివరి నుంచి తేనె సాగు కాలం కావడంతో అక్కడ దీనికి ఈ పేరు వచ్చింది. యూరోప్ లోనే దీనికి రోజ్ మూన్ అని కూడా పేరు. ఈ కాలంలో గులాబీలు అక్కడ పుష్పిస్తుంటాయని అలా పిలుస్తుంటారు. ఇంకా ఫ్లవర్ మూన్, హాట్ మూన్, ప్లాంటింగ్ మూన్ అనే పేర్లు కూడా ఉన్నాయి. హిందువులకు వ్రత పూర్ణిమ ఇది. బౌద్ధులు పోసన్ పోయ అని పిలుస్తారు. మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఆకాశంలో తూర్పు వైపున చూస్తే చంద్రుడి దర్శనం అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles