Hyderabad gangrape case: Three arrested పోలీసుల అదుపులో గ్యాంగ్ రేప్ నిందితులు.. ఇన్నోవా కారు..

Blame game politics mystery surrounding vehicle dominate hyderabad gang rape case

fhyderabad gang-rape, sexual assault, Sex assault, Hyderabad gang rape news, Hyderabad gang rape outrage, Jubilee Hills Gang rape case, BJP, Congress, TRS, KCR, K Chandrashekar Rao, BJP ,Gang rape accused arrested, jubilee hills gang rape, amnesia pub gang rape, pocso, Gangrape case, gangrape cases, Hyderabad gangrape, Telangana Politics

The Hyderabad police has arrested 18-year-old Saaduddin Malik and two juveniles-in-conflict-with-the-law (JICL) so far in connection with the alleged gangrape of a teenager in an upscale area of the city. Of the five accused identified by the victim so far, police said, Saaduddin Malik and Umair Khan are 18-years-old. Umair and another JICL are currently absconding, said DCP Joel Davis.

హైదరాబాద్ పోలీసుల అదుపులో గ్యాంగ్ రేప్ నిందితులు.. ఇన్నోవా కారు..

Posted: 06/04/2022 07:26 PM IST
Blame game politics mystery surrounding vehicle dominate hyderabad gang rape case

హైద‌రాబాద్‌లోని ఆమ్నేషియా ప‌బ్ స‌మీపంలో బాలిక‌ను అప‌హ‌రించి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌లో మొత్తం ఐదుగురు నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్ద‌రు మేజ‌ర్లు కాగా... ముగ్గురు మైన‌ర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితుల‌ను కోర్టులో హాజ‌రుప‌రిచేందుకు పోలీసులు స‌న్నాహాలు చేస్తున్నారు. బీజేపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ ఘటనకు సంబంధించి ఇందులో టీఆర్ఎస్, ఎంఐఎంకు సంబంధించిన నేతల పిల్లలు వున్నారనే అరోపించడం. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా లీక్ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.

ఇప్పటివరకు ఈకేసులో తగు ఆధారాలే లభించలేదని పోలీసులు పేర్కోన్న తరుణంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు పలు ఆధారాలను విడుదల చేయడం.. పోలీసుల్లోనూ కలవరం రేపింది. బెంజ్ కారులో ఉన్న ఎమ్మెల్యే కొడుకు, కారులో సదరు అమ్మాయితో అసభ్యంగా వ్యవహరిస్తున్న ఫొటోలను ఆయన విడుదల చేశారు. పోలీసులు తమను భయపెట్టడం మానేసి, తప్పులు చేసిన వారిని భయపెట్టండని వ్యాఖ్యానించారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే కేసులు పెడతామని పోలీసులు అన్నారని... అందుకు ఈ ఆధారాలన్నీ చూపిస్తున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన పోలీసులకు పలు ప్రశ్నలను కూడా సంధించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అత్యాచారం కేసులో ఇప్పటివరకు కనిపించకుండా పోయిన ఇన్నోవా వాహననా్ని గుర్తించారు. అయితే అత్యాచారం బెంజ్ కారులో జరిగిందా.? లేక ఇన్నోవా వాహనంలో జరిగిందా.? అన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ఘ‌ట‌న త‌ర్వాత వేర్వేరు దారుల మీదుగా క‌ర్ణాట‌క పారిపోయిన నిందితులు ఇన్నోవాను మాత్రం పోలీసుల‌కు చిక్క‌కుండా దాచేశారు. ఈ విష‌యాన్ని గుర్తించిన పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజీల సాయంతో ఇన్నోవా ఆచూకీని క‌నుగొన్నారు. కారులో క్లూస్ టీంతో ఆధారాలు సేక‌రించే ప‌నిని పోలీసులు చేపట్టారు. అయితే ఈ కేసులో కీలక నిందితుడ్ని ఇప్పటికే దేశం దాటించేశారన్న అరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles