Konaseema riots were intentional, says Pawan Kalyan రాజకీయ లబ్ది కోసమే వైసీపీ కోనసీమ అల్లర్లను రేపింది: పవన్ కల్యాణ్

Konaseema arson state did not act despite warning from central intelligence agencies says pawan

Konaseema riots were intentional, says Pawan Kalyan, Konaseema riots, intentional, Pawan Kalyan, Janasena, central Intelligence, state government, precautionary measures, political mileage, Andhra Pradesh, Politics

Jana Sena chief Pawan Kalyan said that the riots that occurred in Konaseema were intentional and planned. He said that the state government had prior information about the incidents but failed to take precautionary measures. The Jana Sena chief reached the party headquarters at Mangalagiri and interacted with the media on his arrival and said that the riots were provoked for political mileage.

రాజకీయ లబ్ది కోసమే వైసీపీ కోనసీమ అల్లర్లను రేపింది: పవన్ కల్యాణ్

Posted: 06/04/2022 09:19 PM IST
Konaseema arson state did not act despite warning from central intelligence agencies says pawan

కోనసీమ అల్లర్లును బహుజన సిద్ధాంతాలపైనా, బహుజన ఐక్యతపైనా జరిగిన దాడులుగా భావిస్తున్నామని పవన్ కల్యాణ్ తీవ్రంగా అక్షేపించారు. అయితే ఈ కులాల మధ్య ఐక్యతను విచ్చిన్నం చేసి రాజకీయం చేయాలని అధికార వైసీపీ భావించడం దరదృష్టకరమని అవేదన వ్యక్తం చేశారు. కోనసీమలో అల్లర్లను రాజేసి.. తద్వారా రాజకీయ లబ్ది కోసం ప్రయత్నించేందుకు కుట్ర జరుగుతోందని ఆయన అరోపించారు. అయితే కులాలపై ఆధారపడి నడుస్తున్న సమాజంలో గొడవలు, ఘర్షణలు జరుగుతుంటాయని అన్నారు. అయితే కులాల మధ్య అగ్ని రాజేసి దాంతో చేతులు కాచుకోవడం.. అత్యంత ప్రమాదకరమని జనసేనాని సూచించారు.

నాడు వంగవీటి రంగా వ్యవహారంలో విజయవాడలో రెండు కులాలు విడిపోయిన పరిస్థితి ఇప్పుడు కోనసీమలో ఏర్పడిందని ఆయన పేర్కోన్నారు. విజయవాడ నెలరోజుల పాటు తగలబడిపోయిందని వివరించారు. కాగా కోనసీమ ఘర్షణలను కులఘర్షణలుగా వైసీపీ ప్రభుత్వం చిత్రీకరిస్తుండడాన్ని తాము సునిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. దీన్ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలిస్తున్నామని వివరించారు. జనసేన సైద్ధాంతిక బలం ఉన్న పార్టీ అని స్పష్టం చేశారు. భారతదేశ రాజకీయాలు కులాలతో ముడిపడి ఉన్న విషయం అందరూ అంగీకరించాల్సిందేనని, ఎన్నికల్లో కుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

కులాలపై ఆధారపడే పార్టీల్లో వైసీపీ కూడా ఒకటని, కులాలను విభజించి పాలించాలని వాళ్లు ప్రయత్నిస్తుంటారని ఆరోపించారు. తాము కులాలను కలపాలని ప్రయత్నిస్తుంటామని ఉద్ఘాటించారు. అన్ని కులాలు శ్రమిస్తేనే ఈ సమాజంలో పనులు జరుగుతాయని, నోటికి ముద్ద చేరాలన్నా దానివెనుక ఎన్నో కులాల కష్టం ఉంటుందని వివరించారు. తెలంగాణలో కులాలను మించి 'తెలంగాణ' అనే భావన ఉంటుందని, కానీ మనకి 'ఆంధ్రా' అనే భావనలేదని పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. దీనికి ముఖ్యకారణం ప్రజలు కాదని, నాయకులేనని ఆరోపించారు. ఇవాళ రాజకీయ జీవితంలో అవినీతి కూడా ఓ భాగమైపోయిందని.. అవినీతి తప్పు కాదన్నట్టుగా తయారైందని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు.

అవినీతితో వచ్చిన వ్యక్తులు ఇవాళ ఏసీబీని కంట్రోల్ చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ గానీ, లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ వంటి నిజాయతీపరులైన అధికారులు ఇలాంటివి చేస్తామని చెబితే అర్థంచేసుకుంటాం. కానీ, అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తులే అవినీతిని నిర్మూలిస్తామని చెబుతుండడం హాస్యాస్పదం. ఎక్కడ అవినీతి జరిగినా ఫిర్యాదు చేయండని ముఖ్యమంత్రి అంటుంటే... మీరే అవినీతిపరుడు అని చెప్పాలని తనకు అనిపించిందని మరీ తానెవరికి పిర్యాదు చేయాలని పవన్ ప్రశ్నించారు. మీరు చేసే ఇసుక అక్రమాలకు మేం ఏ యాప్ కు ఫిర్యాదు చేయాలో చెప్పండి. ఇలాంటివి భరించలేక జనసేన ఆవిర్భావం జరిగడానికి ఒక మూలకారణమైందని అన్నారు.

ఎంతో ప్రశాంతమైన కోనసీమ ఇవాళ భగ్గున రగిలిపోయింది. దీనికంతటికీ కారణం వైసీపీనే. ఎంతో పక్కాగా ప్రణాళిక వేసి గొడవలు రేకెత్తించారు. కేవలం ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేయడం సరికాదు. అన్ని కులాలు ఓట్లు వేస్తేనే వైసీపీ గెలిచింది. కోనసీమ అల్లర్ల గురించి రాష్ట్ర నిఘా వర్గాలకు ముందే తెలుసు. కేంద్రం నిఘా వర్గాలు దీనిపై ముందే హెచ్చరించాయి. ఇన్ని తెలిసి కూడా గొడవలు జరుగుతూ ఉంటే ప్రణాళికతో వ్యవహరించి కోనసీమలో చిచ్చుకు కారణమయ్యారు. వైసీపీది ఓ రౌడీ మూక, గూండాల గుంపు. పద్ధతిగా మాట్లాడడం వాళ్లకు తెలియదు. తమకు ఓటేయని వారిని వర్గశత్రువుగా చూసే ధోరణి వైసీపీ సొంతంమని దుయ్యబట్టారు.

ఈ క్రమంలో కమ్మవారిని వర్గశత్రువుగా చిత్రీకరించారు. జనసేన వైపు ఉన్నారని కాపులను వర్గశత్రువులుగా ప్రకటించేశారు. కమ్మవాళ్లను అన్నీ తిట్టేసి ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే సరిపోతుందా? గోదావరి జిల్లాల్లో ఇక నుంచి వైసీపీని మర్చిపోవచ్చు. మా సహనాన్ని పరీక్షించే ప్రయత్నం చేయొద్దు. కోనసీమ అల్లర్లకు ఏమాత్రం సంబంధంలేని మా జనసేన వాళ్లను అరెస్ట్ చేస్తున్నారు. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని చెప్పే మేం అల్లర్లను ఎలా ప్రోత్సహిస్తామని అనుకున్నారు? నేను మాట్లాడినప్పుడో, మా నేతలు మాట్లాడినప్పుడో మీరు మమ్మల్ని బాధ్యుల్ని చేయాలి... ఈ గొడవకు మీరే బాధ్యులు. జిల్లా పేరు మార్పుకు నెల సమయం ఇచ్చింది మీరేనని మండిపడ్డారు.

మీ వైసీపీ ఎమ్మెల్యే బూతులు తిడితే, మేం వస్తున్నామని 144 సెక్షన్ పెడతారే... మరి అంబేద్కర్ పేరు పెడుతున్నప్పుడు గొడవలు జరుగుతుంటే పోలీసులను మోహరించరా? పారామిలిటరీ బలగాలను దించరా? ఇంత అసమర్థంగా పరిపాలిస్తున్నారు మీరు... కోనసీమలో గొడవలు జరగాలనే మీరు కోరుకున్నారు. కోనసీమ చక్కని వాతావరణాన్ని కలుషితం చేయాలని కంకణం కట్టుకున్నారు మీరు. దీనివల్ల జనసేనకు ఏదో జరిగిపోతుందని మీరు అనుకుంటే అది మీ భ్రమే. నేను కులాలను కలిపేవాడ్ని. మీ పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. కానీ యువజనుల మధ్య చిచ్చుపెడుతోంది మీరే" అంటూ పవన్ కల్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles