Central Government Is Acting Like Dictator: CM KCR అరోగ్య తెలంగాణ కోసమే శ్రమిస్తున్నాం: సీఎం కేసీఆర్

Telangana formation day 2022 central government is acting like dictator says cm kcr

TRS, K Chandrashekhar Rao, CM KCR, Telangana Formation Day, sacrifices of its people, BJP, central governmeTRS, K Chandrashekhar Rao, CM KCR, Telangana Formation Day, sacrifices of its people, BJP, central government, dictator, Telangana, Politicsnt, dictator, Telangana, Politics

On the occasion of Telangana's eighth foundation day, Chief Minister K Chandrashekhar Rao has extended greetings to the state's people, saying the state was formed due to the sacrifices of its people and was built with the same spirit. KCR criticised that the central government is acting like a dictator and that authoritarian tendencies have increased further.

బంగారు తెలంగాణ సాకరమైంది.. అరోగ్య తెలంగాణ కోసమే శ్రమ: సీఎం కేసీఆర్

Posted: 06/02/2022 12:34 PM IST
Telangana formation day 2022 central government is acting like dictator says cm kcr

దేశ చరిత్రలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అపూర్వ ఘట్టమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేళ్లలో పూర్తిచేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచామని అన్నారు. చైనా వంటి దేశాల్లో మాత్రమే సాధ్యమనుకునే వేగంతో ప్రపంచంలో అతిపెద్దదైన ఎత్తిపోతల ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించుకోవడం గర్వకారణమన్నారు. ఈ ప్రాజెక్టులో భాగమైన అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాలకు సమృద్ధిగా సాగునీరు లభిస్తోంది.

బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. పబ్లిక్‌ గార్డెన్స్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. భీమా,‘కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల తదితర పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకున్నం. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, డిండి, చనాకా-కొరాట తదితర ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రపంచంలోని ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో అతిపెద్దదైన రిజర్వాయర్ మల్లన్న సాగరని.. దీని నిల్వ సామర్థ్యం 50 టీఎంసీలు కాళేశ్వరం జలాలను మల్లన్నసాగర్‌కు తీసుకువచ్చి, కొమురవెల్లి మల్లన్న పాదాలు అభిషేకించి మొక్కు తీర్చుకున్నామన్నారు.

తెలంగాణలో 2014 నాటికి 20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేది. 2021 నాటికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 85.89 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించింది. రాష్ట్రంలో అన్ని సాగునీటి వ్యవస్థలు, ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, చెక్ డ్యాం లు, ఆనకట్టలు, కత్వలు, చిన్న, పెద్ద ఎత్తిపోతల పథకాలు ఒకే గొడుగు కిందకి తెచ్చి సాగునీటి శాఖను పునర్వ్యవస్థీకరించింది. కోటి ఎకరాలకుపైగా సాగునీరు అందించడమే ధ్యేయంగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాం’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజలంతా చక్కని ఆరోగ్యం, సుఖ సంతోషాలతో జీవించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ఆశయమని ముఖ్యమంత్రి అన్నారు. అందుకోసం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తోందన్నారు. పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం మాట్లాడారు. ‘ప్రజావైద్యం, ఆరోగ్య రోజురోజుకూ గుణాత్మక పురోగతిని సాధిస్తోంది. తెలంగాణ అవతరణ అనంతరం రాష్ట్రంలోని నిరుపేదలకు కూడా మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తేవాలన్న దృఢసంకల్పంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ముందుగా ప్రభుత్వ హాస్పటిళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచింది. అధునాతన వైద్యపరికరాలు సమకూర్చింది.

హైదరాబాద్ నాలుగువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మితం అవుతున్నాయి. అల్వాల్, ఎల్.బి.నగర్, సనత్ నగర్, గచ్చిబౌలీలలో నిర్మతం అవుతున్న ఈ ఆసుపత్రులలో ఒక్కో దాంట్లో వెయ్యి పడకలు ఏర్పాటవుతాయని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్య వివరాలు, డయాగ్నస్టిక్ సెంటర్ల వివరాలు, పరీక్షల వివరాలు తమ మొబైల్ ఫోన్లలో చూసుకొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకు వచ్చిందని తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలలు, డయాగ్నస్టిక్ కేంద్రాలలో ఎక్కడైనా ఒక చోట పరీక్షలు చేయించినా ఈ యాప్లో రిపోర్టులు పొందువచ్చునని, వీటి ద్వారా డాక్టర్లు వైద్యసేవలు అందిస్తారని’ సీఎం వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles