పెంపుడు కుక్కతో పాటు వాకింగ్ చేసేందుకు స్టేడియం ఖాళీచేయించిన ఐఏఎస్ అధికారుల జంట నిర్వాకంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధీగా ఉండాల్సిన ఐఏెఎస్ అధికారులు కూడా నాయకులను మించిపోతున్నారని నెటిజనులు పలువురు పలురకాలుగా విమర్శలు సంధించారు. వీరిద్దరు చేసిన ఈ చర్యతో యావత్ ఐఏెఎస్ అధికారులకు విమర్శలను ఎదుర్కోనాల్సివచ్చింది. కాగా, ఇప్పడు అదే నెటిజనులు ఒక ఐఏఎస్ అధికారిణి చేసిన పనితో యావత్ దేశవ్యాప్త ఐఏఎస్ అధికారులపై ప్రశంసలు కురిపిస్తున్నారిు.
అదే సోషల్ మీడియా వేదికగా ఐఏఎస్ అధికారి కీర్తి జల్లిపై కురుస్తున్న ప్రశంసలతో తెలుగు ప్రజలు కూడా ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న రాయప్రోలు సుబ్బారావు చెప్పిన మాటలను తనకు అన్వయించుకుని దేశంలోనే ఉన్నా తెలుగువారి గోప్పదనా్ని, కట్టుబాట్లను, అంకితభావాన్ని ఇప్పుడు అసోం ప్రజలకు అర్థమయ్యేలా చేసింది. ప్రజాసేవకై అంకిత భావంతో పనిచేస్తున్న ఆ ఐఏఎస్ అధికారిణి వృత్తినిబద్ధతపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆమె మరెవరో కాదు కీర్తి జల్లి. తెలుగు బిడ్డ.
అసోంలో ఐఏఎస్ అధికారిణి కీర్తి జల్లి మాత్రం అంకితభావం అందరితోనూ ప్రశంసలు అందుకుంటోంది. కాలి నడకన బురదలో నడుచుకుంటూ వెళ్లి వరద ప్రభావిత ప్రాంత వాసుల కష్టాలను వింటున్న ఆమె వృత్తినిబద్ధతపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఢిల్లీ ఐఏఎస్ అధికారుల జంటతో ఆమెను పోల్చుతూ కొనియాడుతున్నారు. తెలుగిు ఆడపడచు కీర్తి జల్లి అసోంలోని కఛార్ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కీర్తి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారారు. అసోంను వరదలు ముంచెత్తి.. కొండచరియలు విరిగిపడి.. అకాల వర్షాలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.
ఈ సమయంలో క్షేత్రస్థాయిలోకి స్వయంగా వెళ్లి.. నాటు పడవల సాయంతో ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని అక్కడి దారులన్నీ కొండచరియల కారణంగా మూసుకుపోయి బురదమయంగా మారగా, అమె ఆ ప్రాంతాన్నింటినీ స్వయంగా పర్యటించి..అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు. చీరకట్టులోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కీర్తి బురదలో సైతం నడుచుకుంటూ వెళ్లి బాధితుల గోడు విన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల సాదకబాధకాలను ఓపిగ్గా విన్న కీర్తి జల్లి వారికి కావాల్సిన నిత్యావసరాలను సైతం పంపిణీ చేశారు.
వరదల నుంచి ఆయా ప్రాంతాలను రక్షించేలా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె అంకితభావం, వృత్తి నిబద్ధతను నెటిజన్లు కొనియాడుతున్నారు. 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కీర్తి జల్లి స్వస్థలం వరంగల్ జిల్లా. ఐఏఎస్ పూర్తైన తర్వతా అసోంలో వివిధ బాధ్యతల్లో పనిచేసిన కీర్తి.. మహిళలు, శిశు మరణాలను తగ్గించడానికి, వారి ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేస్తున్నారు. కొవిడ్ సమయంలో తన వివాహంతో కూడా వార్తల్లో నిలిచారు కీర్తి జల్లి. పెళ్లైన తర్వాత రోజే విధుల్లోకి వెళ్లి తన వృత్తినిబద్ధతను చాటుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more