కాలం మారింది.. కాలంతోపాటు మనుషులు కూడా మారుతున్నారు. సంప్రదాయాలను పాతచింతకాయ పచ్చడిలా భావిస్తున్న యువతరం నిత్యం ట్రెండీ ఆలోచనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పదిమందిలో కొత్తగా కనిపించాలని అనుకోవడమే కాదు.. విభిన్నంగా అలోచించి జీవితంలో ఒక్కాసారి మాత్రమే జరిగే పెళ్లికి కూడా వినూత్నంగా మండపానికి వస్తున్నారు. ఒక్కప్పుడు మేనమాలు, అన్నదమ్ములు పెళ్లికూతురును బుట్టలో ఎత్తుకుని రాగా, అమె తన చేతిలో ఓ కొబ్బరిబోండాన్ని పట్టుకుని వచ్చేది. ఈ తరహా ఆచారం పోయి పెళ్లికూతురు తన స్నేహితురాళ్లు, తన వయస్సు బంధువులతో మండపాన్నికి వస్తోంది.
ఇప్పుడూ పూర్తి ట్రెండీగా అలోచిస్తున్న యువతులు తమకు ఇష్టమైన పాటలు పెట్టుకుని వేదికకు వస్తూ వరుడిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక ఆ మధ్య ఓ వధువు ఏకంగా వరుడి తరహాలో గుర్రపు బగ్గీపై బారత్ నిర్వహిస్తూ చేతిలో తల్వార్ పట్టుకుని పెళ్లి వేధికకు హాజరైంది. ఆమె తరహాలోనే ఈ మధ్యకాలంలో అనేక మంది వధులు తమ పెళ్లిలోనే తమ వినూత్న ఎంటీ కోసం అలోచిస్తున్నారు. పెళ్లిలో సిగ్గుల మొగ్గలవాల్సిన వధువు డ్యాన్స్ చేస్తూ వరుడ్ని ఆశ్చర్యపరుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ఇదే ట్రెండ్ నడుస్తుండగా, తాజాగా మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లా జావ్రా గ్రామంలో ఓ నవ వధువు మరో రకంగా వేదికకు ఎంట్రీ ఇచ్చింది.
పెళ్లి వేదికకు విభిన్నంగానే ఎంట్రీ ఇచ్చిన వధువు ట్రాక్టర్ నడుపుకుంటూ కల్యాణ మండపానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. గ్రామానికి చెందిన భారతి తద్గేకు పొరుగూరు యువకుడితో వివాహం నిశ్చయమైంది. గురువారం సాయంత్రం వివాహం జరిగింది. వధువు భారతి తన అన్నదమ్ములిద్దరినీ చెరో పక్కన కూర్చోబెట్టుకుని ట్రాక్టర్ నడుపుకుంటూ మండపానికి చేరుకుంది. పెళ్లి దుస్తుల్లో ఉన్న వధువు, నల్లని కళ్లద్దాలు ధరించి హుందాగా ట్రాక్టర్ నడుపుకుంటూ మండపానికి వచ్చింది. పెళ్లి కుమార్తె అలా రావడం చూసిన వరుడు సహా పెళ్లికొచ్చిన వారు షాకయ్యారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ చూసేయండి.
A bride in Betul arrived at her wedding on a tractor. The bride, Bharti Tagde, is seen entering the wedding pavilion wearing black glasses and riding a tractor. On the tractor, she is accompanied by her two brothers @ndtv @ndtvindia pic.twitter.com/apdqrIBvyA
— Anurag Dwary (@Anurag_Dwary) May 27, 2022
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more