man cheated in order to claim a refund for a train ticket అకౌంట్‌లో డబ్బులు కట్ అయ్యాయని ఫోన్ చేస్తే..!

A man was cheated out of rs 1 78 lakh in order to claim a refund for a train ticket for rs 578

32 Year old Man, Tution Teacher, Tardeo police station, IRCTC, IRCTC Helpline number, cyber fraudster, Nashik, personal employement, IRCTC website, cyber crime, Maharashtra, Crime

A 32-year-old man who needed a refund of Rs 578 from Indian Railway Catering and Tourism Corporation ended up losing Rs 1.78 lakh. The victim went on a search for a helpline number and ended up calling a cyber fraudster.

అకౌంట్‌లో డబ్బులు కట్ అయ్యాయని ఫోన్ చేస్తే.. రూ.1.78 లక్షలు స్వాహా.!

Posted: 05/25/2022 04:31 PM IST
A man was cheated out of rs 1 78 lakh in order to claim a refund for a train ticket for rs 578

ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని అచ్చంగా ఇలా హైరానా పడిపోయిన ఓ టీచర్.. తన అకౌంట్లోంచి డబ్బులు కట్ అయ్యాయని చేయకూడని పని చేసి.. వందల రూపాయల కోసం వెళ్లి దాదాపుగా రెండు లక్ష రూపాయలను పోగొట్టుకున్నాడు. తీరా తాను తొందరపడి చేసిన పనితో.. భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని తెలుసుకుని బాధపడతున్నాడు.

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)లో టికెట్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించాడు ఓ టీచర్. అయితే టికెట్ బుక్ కాలేదు.. కానీ తన అకౌంట్లోంచి డబ్బులు మాత్రం కట్ అయ్యాయి. దీంతో కంగారుపడిన ఆయన తన డబ్బును అనవసరంగా తీసుకున్నారని భావించి.. వాటిని తిరిగి పోందేందుకు ప్రయత్నించాడు. అయితే డబ్బులు రిఫండ్ ఎలా వస్తాయన్న విషయం తెలియక ఐఆర్సీటీసీ హెల్ప్ లైన్ నెంబరు కోసం వెతికాడు. అయితే అతినిక ఎక్కడా నెంబరు కనిపించకపోవడంతో..నేరుగా గూగుల్ సర్చ్ లోకి వెళ్లి అక్కడ వెతకగా ఓ నెంబరు కనిపించింది.

అంతే ముందు వెనుక అలోచించకుండా డబ్బుల కోసం ఆరాటపడి.. ఆ ఫోన్ నెంబరు నిజంగానే ఐఆర్సీటీసీ వారిదని భావించి దానికి కాల్ చేశాడు. తన డబ్బులు తనకు వస్తాయని భావించే లోపు తన ఫోన్ కు వచ్చిన మసేజ్ చూసి గుండెలు బాదుకున్నాడు. తన ఖాతా నుంచి కట్ అయిన డబ్బులు రాకపోగా.. తన ఖాతాలో నుంచి ఏకంగా రెండు లక్షల రూపాయల డబ్బు కూడా పోయిందని తనకు వచ్చిన పోన్ మెసేజ్ ద్వారా తెలుసుకున్నాడు. తన ఖాతా నుంచి ఏకంగా రూ.1.78 లక్షలు పోగొట్టుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ట్యూషన్ టీచరుగా పనిచేసే సదరు బాధితుడు నాసిక్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకోవడం కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కు వెళ్లాడు.

అయితే ఏదో సాంకేతిక సమస్య కారణంగా టికెట్ బుక్ అవ్వలేదు. తన ఖాతాలో కట్ అయిన రూ.578 తిరిగి రాకపోవడంతో అతను రిఫండ్ కోసం ప్రయత్నించాడు. ఐఆర్‌సీటీసీ హెల్ప్‌లైన్ నెంబరు కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఒక నెంబరు దొరికింది. కానీ అది ఒక సైబర్ మోసగాడి నెంబరు. ఈ విషయం తెలియని బాధితుడు ఆ నెంబర్‌కు కాల్ చేయడంతో.. అతన్ని మోసగించిన సైబర్ మోసగాడు. ఏకంగా రూ.1.78 లక్షలు కాజేశాడు. దీంతో తను మోసపోయానని తెలుసుకున్న ట్యూషన్ టీచర్.. పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles