Lion bites off man's finger at Jamaica Zoo సింహంతో ఆటలోద్దూ అంటే వినరేం..

Watch zookeeper has finger bitten off by lion after teasing it through cage

lion bites off zookeeper finger, jamaica zoo lion bite man hand, zoo keeper pet lion accident, animal harassed in zoo, viral video, Jamaica, Zoo, Viral video, jamaica Zoo, lion attack, Jamaica Society for the Preventional of Cruelty to Animals

A horrifying video has captured the moment a Jamaica zookeeper lost his finger in a battle with a caged lion in front of park visitors. The footage, which has been posted to Twitter and watched more than 4 million times, shows the man poking his hands through the bars of the cage to taunt the animal in a bid to impress onlookers.

ITEMVIDEOS: సింహంతో ఆటలోద్దూ అంటే వింటారా.. ఆనక ఏడిస్తే ఏం లాభం.?

Posted: 05/24/2022 08:30 PM IST
Watch zookeeper has finger bitten off by lion after teasing it through cage

అడవికి రారాజు సింహం. బోనులో ఉన్నాంత మాత్రన దాని జూలు పట్టుకుని ఆడతామంటే.. కుదరదు. ఎక్కడున్నా మృగరాజు.. మృగరాజే. బోనులో ఉంది కదా.. అని దానిని సరదా అడపట్టించేందుకు ప్రయత్నించిగా.. అది కూడా దాని తెలివితేటలను వాడింది. ఫలితంగా జూకీపర్ తన చేతి వేలిని పోగొట్టుకున్నాడు.  'సింహంతో ఆట.. నాతో వేట రెండు చాలా డేంజర్ అంటూ సినిమాల్లో హీరోలు డైలాగ్​లు కూడా చెబుతున్నారంటే.. సింహం అంటే ప్రమాదకరమైన మృగమనే అర్థం. కొందరు సింహాన్ని రెచ్చగొట్టి, ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. జూకు వచ్చిన సందర్శకులను మెప్పించి వారి నుంచి అరకోర నగదును సేకరిస్తుంటారు.

అయితే అవి కూడా ప్రాణులే.. వాటికి కూడా కోపతాపాలు ఉంటాయన్న విషయాన్ని మరవరాదు. సరదాగా అడుకునే సమయంలో పర్వాలేదు కానీ.. విజిటర్స్ వచ్చిన ప్పుడల్లా ఇలా చేయడంతో సింహానికి కూడా చిర్రెత్తుకోచ్చింది. ఫలితం.. మాత్రం చాలా భాదాకరంగా మారింది. ఏదో పదో పరక కోసం చిర్రెత్తిన సింహాన్ని మరింతగా టీజ్​ చేసి, దానికి కోపం తెప్పిస్తూ ఉంటారు. ఇక జూలో ఎవరూ ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పాల్సిన జూకీపర్ ఇలా చేయడంతో ఫలితం కూడా అలాగే ఉంది. జమైకాలోని జూలో ఇదే జరిగింది. ఓ వ్యక్తి.. కేజులో ఉన్న సింహాన్ని టీజ్​ చేస్తుండగా.. ఆ జంతువుకు చిర్రెత్తుకొచ్చింది! అంతే.. అతని వేళ్లను నోటితో పట్టుకుని కొరికేసింది.

సింహాన్ని చూసేందుకు సుమారు 15మంది సందర్శకులు వెళ్లారు. ఆ సమయంలో.. అక్కడ ఓ జూకీపర్​ ఉన్నాడు. ‘సింహంతో ఆటలొద్దు..’ అని ఇతరులకు చెప్పాల్సిన అతనే.. మృగరాజును టీజ్​ చేయడం మొదలుపెట్టాడు. కేజులోకి చేతి వేళ్లు దూర్చి.. పిల్లితో ఆడుకుంటున్నట్టుగా.. సింహాన్ని టీజ్​ చేశాడు. ఆ సింహం కొంతసేపు ఏమీ చేయలేదు. వార్నింగ్​ ఇస్తూ.. అరచింది కూడా. కానీ అతను పట్టించుకోలేదు. వేళ్లతో సింహం ముఖాన్ని తాకడం మొదలుపెట్టాడు. కొన్ని సెకన్లలో అంతా మారిపోయింది. సింహం ఆ వ్యక్తి వేళ్లను.. నోటితో కరిచేసింది.

సింహం పట్టు నుంచి వేళ్లను బయటకు తీసేందుకు ఆ వ్యక్తి చాలా ప్రయత్నించాడు. కానీ ఫలితం దక్కలేదు. చాలా సేపటి తర్వాత.. సింహమే అతడిని వదిలేసింది. అప్పటికే.. ఆ వ్యక్తి కుడి చేతికి ఉండాల్సిన ఒక వేలు పోయింది! సందర్శకుల కెమెరాలకు ఈ దృశ్యాలు చిక్కాయి. కాగా.. చుట్టుపక్కన అంత మంది ఉండగా.. ఒక్కరు కూడా అతడిని రక్షించేందుకు ప్రయత్నించలేదు. దీనిపై స్పందించిన ఓ సందర్శకురాలు.. 'జూకీపర్​ షో ఆఫ్​ చేశాడు. అదేదో జోక్​ జరుగుతోందేమే అని మేము అనుకున్నాము. పరిస్థితి తీవ్రత మాకు అర్థం కాలేదు.

అతని రక్తాన్ని చూసిన తర్వాతే.. అది జోక్​ కాదని తెలిసింది. ఆ వేలికి ఉన్న చర్మం మొత్తం ఊడిపోయింది,' అని చెప్పింది. సామాజికి మాధ్యమాల్లో వైరల్​గా మారిన ఈ దృశ్యాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. సింహాల రక్షణపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు జూ వర్గాలు వెల్లడించాయి మరోవైపు.. మనుషులకు, జంతువులకు తమ జూ ఎంతో సురక్షితమైనది సిబ్బంది ఓ ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకుంటామని హామీనిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles