ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోనామహమ్మారి.. భారత్‌లోనూ మరోమారు విజృంభించనుందా.? అంటే ఔనన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి ఓమిక్రాన్ రకం వైరస్ ఉపవేరియంట్లు దేశంలోనూ వెలుగుచూడటంతో ఈ అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే యూరోపియన్ రోగనియంత్రణ, నిరోధక కేంద్ర ఒమిక్రాన్ ఉపవేరియంట్లు బి4, బి5లను అందోళనకార వేరియంట్లుగా గుర్తించాయి. ఇక మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఒ) కూడా ఈ ఓమిక్రాన్ ఉపవేరియంట్లను అందోళనకర వేరియంట్లుగానే పరిగణించింది.
వివిధ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతికి కారణమైన ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు.. ఇప్పటికే అటు దక్షిణాఫ్ఱికా, చైనా, యూనైటెడ్ కింగ్ డమ్, సహా అమెరికాలలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. అయితే ఇవన్నీ బిఏ 1, భిఏ 2 సహా పలు వేరియంట్లు. కానీ హైదరాబాద్‌లో మరో కొత్త వేరియంట్ వెలుగుచూసింది. అంతేకాదు అటు తమిళనాడులోనూ మరో కొత్త వేరియంట్ వెలుగుచూసింది. ఒమిక్రాన్ కు చెందిన ఉపవేరియంట్లు బిఏ 4 తమిళనాడులో బయటపడగా, బిఏ్ర వేరియంట్లు హైదరాబాదులో వెలుగులోకి వచ్చాయి. ఉపవేరియెంట్లు బీఏ.4, బీఏ.5లు.. కరోనాలో ఇప్పటిదాకా అత్యంత వేగవంగా వైరస్‌ను వ్యాప్తి చెందించేవిగా పేరొందాయి.
కాగా, ఒమిక్రాన్ ప్రధాన వేరియంట్ కంటే ఇవి ప్రమాదకారి కాదని, కాకపోతే వీటి ద్వారా సామాజిక వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఈ వేరియంట్లు తొలుత దక్షిణాప్రికా నుంచే ప్రారంభమయ్యాయని అయితే శరవేగంగా వ్యాప్తిం చెందే లక్షణం ఉండటంతో ఇది దేశంలో మూడవ దశకు దారితీసే ప్రమాదం పోంచివున్న కారణంగా సర్వత్రా అందోళన వ్యక్తమవుతోంది. అయితే కరోనా ప్రధాన వేరియంట్లు అల్పా. బీటా, డెల్టా, ఒమిక్రాన్ తరహాలో ఇవి ప్రమాదకారి కాదని వైద్యవర్గాలు వెల్లడించాయి,
ఇన్సాకాగ్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. తమిళనాడులో 19 ఏళ్ల యువతిలో బీఏ.4 ఉపవేరియెంట్ బయటపడిందని, అలాగే తెలంగాణలో (హైదరాబాద్ ఎయిర్పోర్ట్) సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి శాంపిల్‌లోనూ ఈ ఉపవేరియెంట్ వెలుగు చూసింది. మరోవైపు తెలంగాణలోనే 80 ఏళ్ల వ్యక్తికి బీఏ.5 ఉపవేరియెంట్ కనుగొన్నట్లు ఇన్సాకాగ్ తెలిపింది. ఈ వృద్ధుడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని, పైగా వ్యాక్సినేషన్ ఫుల్‌గా పూర్తికాగా, కేవలం స్వల్పకాలిక లక్షణాలే బయటపడినట్లు తెలిపింది. ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తమైన అధికారులు.. కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలుపెట్టారు.
భారత్‌లో ఇప్పటికే టీకా కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం వల్ల ఈ రెండు సబ్ వేరియంట్ల ప్రభావం స్వల్పంగానే ఉండవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు సబ్ వేరియంట్ల వల్ల కొద్దిరోజుల్లో కేసులు పెరగవచ్చు, కానీ, ఉద్ధృతి తక్కువగానే ఉంటుందంటున్నారు. బాధితులకు తీవ్రస్థాయి అనారోగ్య ముప్పు, ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఉండవని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ.. మరిన్ని వేరియెంట్లు.. అందులో ప్రమాదకరమైనవి ఉండే అవకాశాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Jun 29 | హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసం.. నెట్టింట్లో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయస్సులోనూ అమెలో ఉత్సాహం, ఉల్లాసం ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నేటి యువతకు అమె... Read more
Jun 29 | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై... Read more
Jun 29 | రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన... Read more
Jun 29 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన... Read more
Jun 29 | కరోనా మహమ్మారి తరువాత ఆహార పదార్థాలకు రెక్కలు వచ్చాయని.. తమ పరిస్థితి మూలిగే నక్కలా తయారైందని సామాన్యులు బాధపడుతున్న తరుణంలో కేంద్ర ఇచ్చిన షాక్ తో వారిపై తాటికాయపడినట్లైంది. ఆహార పదార్థాల ధరలు మరింత... Read more