Voters came in Innerwear for casting Votes! ఆస్ట్రేలియా ఎన్నికలపై ‘స్మగ్లర్స్ డిసైడ్’ హ్యాష్ ట్యాగ్ ప్రభావం..

Why australians voted in the election in nothing but their underwear

Aussies Voters, Swimwear, Brand, Public Relative Campaign, Australia Elections, Underwear, budgy smuggle, smugglers decide, poastal voting, early voting, Anthony Albanese, Australian Labor Party, Scott Morrison, Elections, Australia

Australian elections have been garnering lots of media attention due to several reasons but this one reason comes as the most bizarre one. People were seen voting wearing just their underwear. No, this was not because of the hot weather but because of a PR campaign by the swimwear brand, Budgy Smuggler.

ఆస్ట్రేలియా ఎన్నికలపై ‘స్మగ్లర్స్ డిసైడ్’ హ్యాష్ ట్యాగ్ ప్రభావం.. లోదుస్తుల్లో ఓటర్లు..

Posted: 05/23/2022 12:47 PM IST
Why australians voted in the election in nothing but their underwear

ఆస్ట్రేలియాలో దభాబ్దమున్నర కాలం తరువాత ఎన్నికలు జరిగాయి. 2007లో ఎన్నికలను చవిచూసిన తరువాత పదిహేనేళ్ల తరువాత తాజాగా 2022లో మళ్లీ గత శనివారం ఎన్నికలు జరిగాయి. అయితే అప్పటి ఎన్నికల కంటే ఈసారి ఎన్నికలకు మాత్రం విపరీతమైన మీడియా అటెన్షన్ లభించింది. అధికారంలో వున్న లిబరల్ పార్టీని.. దానికి ప్రాతినిథ్యం వహిస్తున్న స్కాట్ మోరిసన్ ను లేబర్ పార్టీ నుంచి ప్రధానిగా బరిలో నిలిచిన అంథోని అల్బానీస్ ఓడించారు. అయితే మునుపెన్నడూ లేని విధంగా ఈ ఎన్నికలలో వందల సంఖ్యలో ఓటర్లు లోదుస్తుల్లో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది.

వీరంతా ఏదో విషయమై నిరసన వ్యక్తం చేస్తూ ఇలా లోదుస్తులలో వచ్చి ఎన్నికల బరిలో నిలిచారా.? అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇదికాకపోతే వేడిమి వాతావరణం కారణంగా అక్కడి ఓటర్లు ఇలా వచ్చారా.. అంటే అదీ కాదు. అటు నిరసన కాదు.. ఇటు వేడిమి కాక మరేంటీ.. అంటే.. ఓ సంస్థ ఇచ్చిన ప్రచారంలో భాగంగా అక్కడి ఓటర్లు వందల సంఖ్యలో లోదుస్తుల్లో వచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఫ్రీగా వస్తే ఫెనాయిల్ తాగేవాళ్లు అన్న నానుడి మనం చాలా సందర్భల్లో వింటూనే ఉంటా. అయితే ఈ సూక్తి ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంనైనా వర్తిస్తుందని పెద్దల మాట. అయితే అస్ట్రేలియాలో మాత్రం ఎన్నికల సందర్భంగా ఇది నిరూపితమైంది.

కాంపిటేటివ్ స్విమ్‌వేర్ బ్రాండ్ కంపెనీ ‘బడ్జీ స్మగ్లర్’ ఇచ్చిన ఫ్రి ఆఫర్‌ ను అందుకునేందుకు వందల సంఖ్యలో అసీస్ వాసులు ఇలా అండర్‌వేర్లు ధరించి పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. లోదుస్తులు ధరించి ఓటేసి దానిని సోషల్ మీడియాలో #SmugglersDecide హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేశారు. ఇలా ఎందుకు చేశారు అంటే ఇలా చేసిన ప్రతీ ఒక్కరికి తమ స్మిమ్మ్ వేర్ ను ఉచితంగా ఇస్తామని ఆ కంపెనీ ప్రకటించింది. దాంతో వందల మంది అసీస్ ఓటర్లు ఆ ఆపర్ ను అందుకునేందుకు ఓటింగ్ కేంద్రాలకు లో దుస్తుల్లో తరలివచ్చి ఓటు వేశారు. ఈ ఆఫర్ తెగ నచ్చడంతో పురుషులు, మహిళలు అండర్‌వేర్ ధరించి పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లేశారు.

పురుషులు అండర్‌వేర్‌తో రాగా, మహిళలు స్విమ్ సూట్ ధరించి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారంతా తమ ఫొటోలను షేర్ చేశారు. తమ ప్రకటనకు ఇంత పెద్ద ఎత్తున స్పందన వస్తుందని ఊహించలేదని ‘బడ్జీ స్మగ్లర్స్’ ఆనందం వ్యక్తం చేసింది. ఏదో ఒకరిద్దరు ఇలా వస్తారని భావించామని, కానీ వందలమంది వచ్చారని పేర్కొంది. వారందరికీ సోమవారం నుంచి బహుమతులు ఇస్తామని ప్రకటించింది. కాగా, శనివారం ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ నేత అల్బనీస్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతారు.

 
 
 
View this post on Instagram

A post shared by Budgy Smuggler™ (@budgysmuggler)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh