దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చిచెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని స్పష్టం చేసింది. నిందితులపై పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపినట్టుగానే ఉందని పేర్కొంది. ఈ వ్యవహారంతో సంబంధమున్న వి.సురేందర్, కె.నర్సింహారెడ్డి, షేక్ లాల్ మదర్, మహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, కె.వెంకటేశ్వర్లు, ఎస్.అరవింద్ గౌడ్, డి.జానకిరామ్, ఆర్.బాలు రాథోడ్, డి.శ్రీకాంత్.. ఈ పది మంది పోలీసులపై హత్యానేరం కింద ఐపీసీ సెక్షన్ 302 కింద విచారణ చేయాలని తమ నివేదికలో సిఫార్సు చేసింది.
కమిషన్ జనవరి 28నే సీల్డు కవర్లో 387 పేజీల సుదీర్ఘ నివేదికను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు అందజేయగా.. కోర్టు ఆదేశాల మేరకు కమిషన్ సెక్రటేరియట్ ఈ నివేదికను బహిర్గతం చేసింది. కమిషన్ తమ నివేదికలో ఎన్కౌంటర్ ఘటనకు సంబంధించిన అంశాలతోపాటు 15 సాధారణ సిఫార్సులు కూడా చేసింది. సత్వర న్యాయం పేరిట పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని స్పష్టం చేసింది. ఘటన ప్రాంతానికి సంబంధించి అందిన కొన్ని వీడియో ఫుటేజీలు ఆర్డర్లో లేవని. పైగా అవి నిడివి తక్కువగా ఉన్న క్లిప్పింగ్లని తెలిపింది. అవి ప్రాథమిక ఫుటేజీ నుంచి సేకరించినట్టుగా ఉన్నాయని పేర్కోంది.
సెక్షన్ 161 సీఆర్పీసీ కింద ఒకే సాక్షి వాంగ్మూలాన్ని పదేపదే ఎందుకు సేకరించారో కూడా చెప్పలేదు. మృతదేహాలను తరలించిన బస్సుకు సంబంధించి పలు లాగ్‌బుక్స్ ఉన్న అంశంపైనా సమాధానం లేదు. గాయపడిన పోలీసులకు సంబంధించి ఆస్పత్రిలో రికార్డు లేకపోవడం, ఖాళీ అయిన బుల్లెట్ క్యాట్రిడ్జ్‌లు అన్నీ తిరిగి సేకరించకలేకపోవడం, ఘటనా స్థలం నుంచి కాల్చి న బుల్లెట్లనూ సేకరించలేకపోవడం వంటివాటిని కేవలం దర్యాప్తులో లోపాలుగా చెప్పలేం. మృతదేహాలు, ఇతర వస్తువుల స్థానాల్లో కీలక తేడాలు, విచారణ నివేదికలు, క్రైం సీన్ పంచనామాల్లో వ్యత్యాసాలు చూస్తుంటే పోలీసుల వాదన నమ్మశక్యం కాదని నిర్ధారణ అవుతోంది.
పోలీసు అధికారి సైదుపల్లి అరవింద్ గౌడ్‌ను జొల్లు శివ కర్రతో.. మరో పోలీసు అధికారి కె.వెంకటేశ్వర్లును జొల్లు నవీన్ రాళ్లతో కొట్టారని పోలీసుల రిపోర్టులో ఉంది. గాయాలైన పోలీసులను షాద్‌నగర్ సీహెచ్‌సీకి, అక్కడి నుంచి కేర్ ఆస్పత్రికి తరలించినట్టు ఉంది. కానీ పోలీసు సిబ్బంది మెడికల్ రికార్డులో, మెడికో లీగల్ సర్టిఫికెట్లో వేర్వేరుగా గాయాల వివరాలున్నాయి. ఒక డాక్యుమెంట్లో వారిని కేర్ ఆస్పత్రికి రిఫర్ చేసినట్టు ఉంటే.. మరోదానిలో ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేసినట్టు ఉంది. పోలీసుల చికిత్సకు సంబంధించి ఒరిజినల్ రికార్డులన్నీ సిట్‌కు ఇచ్చారు. కానీ కమిషన్ ముందు వాటిని ప్రవేశపెట్టలేదు. ఎక్స్‌రే, సీటీ స్కాన్ కూడా ప్రవేశపెట్టలేదు. నుదుటికి గాయమైన పోలీసుకు సంబంధించి ఒకచోట కుడివైపు అని, మరోచోట ఎడమవైపు అని రాశారు.
(And get your daily news straight to your inbox)
Jun 29 | హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసం.. నెట్టింట్లో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయస్సులోనూ అమెలో ఉత్సాహం, ఉల్లాసం ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నేటి యువతకు అమె... Read more
Jun 29 | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై... Read more
Jun 29 | రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన... Read more
Jun 29 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన... Read more
Jun 29 | కరోనా మహమ్మారి తరువాత ఆహార పదార్థాలకు రెక్కలు వచ్చాయని.. తమ పరిస్థితి మూలిగే నక్కలా తయారైందని సామాన్యులు బాధపడుతున్న తరుణంలో కేంద్ర ఇచ్చిన షాక్ తో వారిపై తాటికాయపడినట్లైంది. ఆహార పదార్థాల ధరలు మరింత... Read more