ప్రజల పక్షాన నిలుస్తూనే తాము అడవుల బాట పట్టామని ప్రకటించుకునే నక్సలైట్లతో శాంతి చర్చలకు చత్తీస్ గఢ్ ప్రభుత్వం సిద్దమని సంకేతాలను ఇచ్చింది. అయితే శాంతి చర్చలకు ముందు వారు భారత రాజ్యంగంపైన తమకు పూర్తి విశ్వాసం ఉందని ప్రకటించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ అన్నారు. సుక్మా జిల్లాలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వంతో షరతులతో కూడిన చర్చలకు రెడీ అన్న మావోల ప్రకటనపై మాట్లాడుతూ.. చర్చలకు తామూ సిద్ధమేనని, అయితే వారు రాజ్యాంగం పట్ల విశ్వాసం ప్రకటించాలని అన్నారు.
చర్చలకు బస్తర్ కంటే మంచి ప్రదేశం మరోటి ఉండదన్నారు. మావోయిస్టులు చర్చలు జరపాలంటే ప్రభుత్వం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. చత్తీస్‌గఢ్‌లో నక్సలిజం సుక్మాప్రాంతంలోనే మొదలైందని, ఇక్కడి నుంచే వారి తిరోగమనం కూడా జరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. సుక్మానే కాదు, ఎక్కడైనా చర్చలకు రెడీయేనని స్పష్టంచేశారు. అయితే, భారత రాజ్యంగంపై నక్సలైట్లు సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించడం అంటూ మెలిక పెట్టారా.. అన్న వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. భారత రాజ్యాంగాన్ని విశ్వసించకపోతే చర్చలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
కాగా, జైళ్లలో ఉన్న తమ నేతలను విడుదల చేయడంతోపాటు కొన్ని ప్రాంతాల నుంచి భద్రతా బలగాలను ఉపసంహరించుకుంటే ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని ఇటీవల మావోలు ప్రకటించారు. అయితే ముందుగా చర్చలకు అనుకూలమైన వాతావరణం ఏర్పర్చిన తరువాతనే చర్చలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి పేర్కెన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం బఘేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఆ రాష్ట్ర హోం మంత్రి తామరద్వాజ్ సాహూ కూడా నక్సలైట్లతో బేషరతు చర్చలకు సిద్ధమేనని ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Jun 29 | హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసం.. నెట్టింట్లో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయస్సులోనూ అమెలో ఉత్సాహం, ఉల్లాసం ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నేటి యువతకు అమె... Read more
Jun 29 | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై... Read more
Jun 29 | రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన... Read more
Jun 29 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన... Read more
Jun 29 | కరోనా మహమ్మారి తరువాత ఆహార పదార్థాలకు రెక్కలు వచ్చాయని.. తమ పరిస్థితి మూలిగే నక్కలా తయారైందని సామాన్యులు బాధపడుతున్న తరుణంలో కేంద్ర ఇచ్చిన షాక్ తో వారిపై తాటికాయపడినట్లైంది. ఆహార పదార్థాల ధరలు మరింత... Read more