SC grants bail to Indrani Mukherjee in Sheena Bora case షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణీ ముఖర్జీయాకు బెయిల్‌

Sheena bora murder case supreme court grants bail to indrani mukherjee

indrani mukerjea, sheena bora murder case, sheena bora murder case recap, sheena bora murder case timeline, indrani mukerjea bail, indrani mukherjee, indrani mukherjea., mumbai news, cbi, cbi sheena bora murder, Peter Mukherjea, Supreme Court on Sheena Bora murder case, Sheena Bora murder case, Indrani Mukerjea bail, sheena bora, new delhi, Crime

The Supreme Court on Wednesday granted bail to Indrani Mukherjee in the Sheena Bora murder case after 6.5 years in custody. The court has also observed that the other accused in the case, Peter Mukherjea is on bail since February 2020.

ఇంద్రాణీ ముఖర్జీయాకు ఊరట.. షీనా బోరా హత్య కేసులో బెయిల్‌

Posted: 05/18/2022 04:34 PM IST
Sheena bora murder case supreme court grants bail to indrani mukherjee

షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియాకు దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఎట్టకేలకు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. తన కూతురు షీనా బోరా హత్యకేసులో అభియోగాలు ఎదుర్కోంటున్న ఇంద్రాణి.. అరెస్టైన 2015 నుంచి దాదాపుగా ఆరున్నరేళ్లుగా జ్యుడిషియల్ రిమాండ్ లోనే ఉంది. ఇదే పాయింట్ ను ఆధారంగా చేసుకుని అమె తరపు న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానంలో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. ఇది చాలా ఎక్కువ సమయం అని వ్యాఖ్యానించింది.

ఈ మేరకు అమెకు ఇవాళ బెయిల్ మంజూరు చేసిన అత్యున్నత న్యాయస్థానం షరతులను కూడా విధించింది. అయితే ఈ కేసులో మరో నిందితుడిగా అభియోగాలు ఎదర్కెన్న అమె భర్త పీటర్ ముఖర్జీకు రెండేళ్ల క్రితమే బెయిల్ మంజూరు చేసింది. కాగా ఆయన బెయిలుపై విధించిన షరతులే ఇంద్రాణికి కూడా వర్తిస్తాయని జస్టిస్ ఎల్. నాగేశ్వర రావు, జస్టిస్ బిఆర్ గవల్ లతో కూడిన సర్వోన్నత న్యాయస్థాన ద్విసభ్య ధర్మసనం తెలిపింది .కాగా 2012లో సంచలనం సృష్టించిన షీనా బొరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియా ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

తన రెండో భర్త సంజీవ్‌, డ్రైవర్ శ్యామ్‌ రాయ్‌ సహకారంతో షీనాను ఇంద్రాణీ ముఖర్జీ హత్య చేసింది. ఈ కేసులో హత్య జరిగిన మూడు సంవత్సరాలకు 2015 ఆగస్టు 25న ఇంద్రాణి అరెస్ట్‌ అయ్యారు. అనంతరం మూడో భర్త పీటర్‌ ముఖర్జియాను సైతం అదుపులోకి తీసుకోగా.. 2020లో పీటర్‌కు బెయిల్‌ వచ్చింది. ఇంద్రాణీ జైలుశిక్ష అనుభవిస్తున్న సమయంలో తన కుమార్తె ప్రాణాలతోనే ఉందని సీబీఐకి లేఖ రాసింది. షీనా బోరాను జైలు అధికారి ఒకరు కశ్మీర్‌లో చూశానని చెప్పిందని ఆ లేఖలో పేర్కొంది. ఈ విషయమై దర్యాప్తు కూడా చేయాలని సీబీఐని కోరింది. 2015 నుంచి ముంబై జైల్లో అండర్ ట్రయల్‌గా ఉన్నా.. బెయిల్ లభించకపోవడంతో సుప్రీం తలుపు తట్టింది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం తాజాగా బెయిల్ మంజూరుచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indrani Mukerjea  Supreme Court  Bail  Sheena Bora  Murder case  Peter Mukherjea  new delhi  Crime  

Other Articles