పూర్వ కాలంలో ఆహారం వేరు. వాళ్లు ఎక్కువగా సిరిదాన్యాలతో కూడిన ఆహారం అందులోనూ ఎక్కువగా రోటీల రూపంలో తీసుకునేవారు. వాటితో వారికి కావాల్సినంత బలం అందడమే కాదు.. ఎలాంటి రోగాలనైనా ఎదుర్కోనే రోగనిరోధక శక్తి కూడా అందేంది. ఇక వారు లైఫ్ స్టైయిల్ కూడా భిన్నంగా ఉండేంది. వారు ఉదయం మూడున్నర నుంచి లేచి పోలాలకు వెళ్లి పనులు చేసుకునేవారు. ఎక్కువ శారీరిక శ్రమ చేసేవారు. ఇక మధ్యాహ్నం వేళల్లో ఎంతటి ఎండాకాలమైనా.. కానుగ చెట్టు, లేదా వేప చెట్టు కిందపడుకుని హాయిగా కునుకు తీసేవారు. రాత్రిళ్లు ఎనమిది దాటిందంటే ఎవరూ మెలకువ ఉండేవారు కాదు.
కానీ మారుతున్న సాంకేతికతతో ఇప్పటి లైప్ స్టెయిల్ మారిపోయింది. ఇక ఇప్పటి తరం తీసుకుంటున్న ఆహారం వేరు. నేటి ఆహారం స్వచ్ఛమైనది కాదు. అదే సమయంలో శారీరక శ్రమ అవసరం తగ్గిపోయిన పరిస్థితుల్లో ఉన్నాం. ఈ తరుణంలో ఏది తీసుకున్నా దాని తాలూకు ప్రభావం మన ఆరోగ్యంపై స్పష్టంగా ఉంటోంది. ముఖ్యంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇందులో ఆహారం పాత్ర కూడా ఉంటోంది. కొన్ని రకాల పదార్థాలు క్యాన్సర్ రిస్క్ ను పెంచుతున్నట్టు పలు అధ్యయనాల్లో గుర్తించారు. మనం రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో కేన్సర్ రిస్క్ పెంచే వాటిని పరిశీలించినట్టయితే..
హైడ్రోజెనేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్
ఆహారోత్పత్తుల తయారీదారులు ఆహారం ఎక్కువ కాలం పాటు తాజాగా ఉండేందుకు వినియోగించే ఫ్యాట్ ఇది. ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ ను ఇది పెంచుతుంది. ఇందులో ఉండే అధిక ట్రాన్స్ ఫ్యాట్ వల్లే ఇలా జరుగుతుంది. క్యాన్సర్, గుండె జబ్బులు, ఆటో ఇమ్యూన్ వ్యాధులకు ట్రాన్స్ ఫ్యాట్ కారణమవుతుంది.
ఉప్పు అధికంగా ఉండేవి
అధిక ఉప్పు ఉండే పదార్థాలతో క్యాన్సర్ రిస్క్ ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ప్రధానంగా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కు దారితీయవచ్చు. మన జీర్ణకోశం లోపలి వైపు రక్షణ కల్పించే మ్యుకోసా అనే లేయర్ ఉంటుంది. అధిక ఉప్పుతో ఉండే పదార్ధాలతో ఈ లేయర్ దెబ్బతింటుంది. దీంతో కడుపులో క్యాన్సర్ కు దారితీసే ప్రమాదం ఉంటుంది. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు ముప్పు కూడా పెరుగుతుంది. అధికంగా ఉప్పు ఉండే పిజ్జా, పీస్, సాస్ లు, బ్రెడ్ కు దూరంగా ఉండాలి. నోటికి ఉప్పగా అనిపించకపోతే ఉప్పు తక్కువగా ఉందని అనుకోవద్దు.
రిఫైన్డ్ షుగర్
మనం నిత్య జీవితంలో వినియోగించే పంచదార శుద్ధి చేసినది. ఇలా రిఫైన్డ్ చేసిన షుగర్ వాడకం వల్ల క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందడానికి దారితీసే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. ఒబెసిటీ, టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బుల రిస్క్ కూడా పెరుగుతుంది.
మైదా పిండి
మన ఆరోగ్యానికి ఎక్కువ చేటు చేసే పదార్థాల్లో మైదా పిండి కూడా ఒకటి. బిస్కెట్లు, బ్రెడ్, పిజ్జాలు, బజ్జీలు ఇలా ఎన్నో పదార్థాలకు మైదానే వాడుతుంటారు. ఇది తెల్లగా ఉండడం గమనించే ఉంటారు. క్లోరిన్ గ్యాస్ తో బ్లీచ్ చేయడం వల్లే ఇంత తెల్లగా వస్తుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ వేగంగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఇందులో గ్లైసిమిక్ రేటు అధికంగా ఉంటుంది. బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉంటే క్యాన్సర్ ట్యూమర్లు పెరిగే రిస్క్, కొలన్ క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుంది.
ప్రాసెస్డ్ మీట్
ఒక వారంలో 700 గ్రాములకు మించి రెడ్ మీట్ తీసుకుంటే బవెల్ కేన్సర్ పెరుగుతుంది. రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ లో కొన్ని రకాల కెమికల్స్ ఉంటాయి. అవి ఆహారాన్ని క్యాన్సర్ కారకాలుగా మారుస్తాయి. హామ్, బెకాన్, సలామి ప్రాసెస్డ్ మీట్ లను గ్రూపు 1 హానికారకమైనవిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం గుర్తించింది.
(And get your daily news straight to your inbox)
Jun 29 | హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసం.. నెట్టింట్లో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయస్సులోనూ అమెలో ఉత్సాహం, ఉల్లాసం ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నేటి యువతకు అమె... Read more
Jun 29 | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై... Read more
Jun 29 | రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన... Read more
Jun 29 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన... Read more
Jun 29 | కరోనా మహమ్మారి తరువాత ఆహార పదార్థాలకు రెక్కలు వచ్చాయని.. తమ పరిస్థితి మూలిగే నక్కలా తయారైందని సామాన్యులు బాధపడుతున్న తరుణంలో కేంద్ర ఇచ్చిన షాక్ తో వారిపై తాటికాయపడినట్లైంది. ఆహార పదార్థాల ధరలు మరింత... Read more