2 killed in Houston flea market shooting అమెరికాలో రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి

Three killed in two separate shooting incidents at church flea market in us

California church shooting, Houston flea market shooting, California shooting, church shooting, Houston shooting, flea market shooting, gangsters shooting, United States, Gun Violence, Gun Culture, Joe Biden, America, Crime

Three persons were killed in two separate shooting incidents in the United States. While one person was killed and at least four others were injured in a shooting at a church in the western US state of California, two people were killed and three others critically injured in a shooting at a flea market in Houston.

అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పుల మోత.. రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి

Posted: 05/16/2022 01:43 PM IST
Three killed in two separate shooting incidents at church flea market in us

అగ్రరాజ్యం అమెరికాలో మ‌రోసారి కాల్పుల‌ మోతమోగింది. న్యూయార్క్‌లోని బ‌ఫెలో ప్రాంతంలో చోటు చేసుకున్న కాల్పుల ఘ‌ట‌నలో పడిన రక్తపు మరకలు గడ్డకట్టకముందే.. మరో రెండు ప్రాంతాల్లో కాల్పుల మోత మార్మోగాయి. బఫెలో కాల్పుల ఘటన విగిల్చిన విషాదం జరిగి 24 గంటలు కూడా గడవ‌క ముందే అగ్రరాజ్యంలోని రెండు ప్రాంతాల్లో కాల్పుల మోత క‌ల‌క‌లం రేపుతున్నాయి. అమెరికాలోని హ్యుస్ట‌న్ మార్కెట్లో ఓ దుండ‌గుడు కాల్పులు జ‌ర‌ప‌డంతో ఇద్ద‌రు వ్య‌క్తులు మృతి చెందగా.. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మరో ఘటన ఏకంగా ప్రార్థనా మందిరంలో చోటుచేసుకుంది. కాలిఫోర్నియా చర్చిలో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతిచెందారు.

హ్యుస్టన్ మార్కెట్లో జరిగిన ఘటన వివరాలు స్థానిక పోలీసులు వెల్లడించిన ప్రకారం.. బ‌హిరంగ మార్కెట్‌లో కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పులు రెండు గ్రూపులకు మధ్య జరిగిన ఆదిపథ్యంలో భాగమేనని సమాచారం. అయితే రెండు గ్రూపుల మ‌ధ్య చోటు చేసుకున్న ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణ‌ంతో కాల్పుల‌కు దారి తీసింద‌ని పేర్కొన్నారు. కాగా ఈ కాల్పుల ఘటనలో పాల్గోన్నవారంతా ఇరవైఏళ్ల లోపు యువకులేనని పోలీసులు తెలిపారు, ఈ కాల్పుల ఘ‌ట‌న‌కు సంబంధించి ఇద్ద‌రు అనుమానితుల‌ను అదుపులోకి తీసుకుని, వారిద్ద‌రి నుంచి రెండు తుపాకుల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు చెప్పారు. ఈ కాల్పుల ఘటనలో గాయపడిన వారందరూ కూడా 20 ఏండ్ల‌లోపు వార‌ని పోలీసులు తెలిపారు.

ఇక మరో ఘటన ద‌క్షిణ కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. ఈ కాల్పుల ఘటన ఓ చ‌ర్చిలో సంభవించింది. దుండ‌గుడు జ‌రిపిన కాల్పుల్లో ఒక‌రు మృతి చెంద‌గా, మరో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కాల్పుల ఘ‌ట‌న కేసులో ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అమెరికాలో 18 ఏండ్ల శ్వేత జాతి యువ‌కుడు న‌ల్ల‌జాతీయుల‌పై విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పుల‌కు తెగ‌బ‌డిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో 10 మంది చ‌నిపోగా, మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘోరానికి పాల్ప‌డుతున్న స‌మ‌యంలో నిందితుడు లైవ్ స్ట్రీమింగ్ చేసిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు.

న్యూయార్క్‌లోని బఫే కాల్పుల ఘ‌ట‌న‌పై అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ స్పందించారు. జాతి విద్వేషానికి వ్య‌తిరేకంగా జాతీయ ఐక్య‌త‌కు బైడెన్ పిలుపునిచ్చాడు. త‌న వ్యాఖ్య‌ల‌ను ఆధిప‌త్య చ‌ర్య‌గా న్యాయ‌శాఖ పేర్కొంద‌ని బైడెన్ చెప్పారు. తుపాకీ సంస్కృతి క‌ట్ట‌డికి న్యూయార్క్ గ‌వ‌ర్న‌ర్, బ‌ఫేలో మేయ‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు. అమెరికాలో 18 ఏండ్ల శ్వేత జాతి యువ‌కుడు న‌ల్ల‌జాతీయుల‌పై విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పుల‌కు తెగ‌బ‌డిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో 10మంది చ‌నిపోగా, మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. న్యూయార్క్‌  బ‌ఫెలో ప్రాంతంలోని ఓ సూప‌ర్ మార్కెట్‌లో ఈ దారుణం జ‌రిగింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles