Man held for duping over 100 women of ₹1 crore పెళ్లి పేరుతో 100 మంది యువతులకు రూ. కోటి మేర టోకరా.!

Delhi 35 year old held for duping over 100 women from 13 states of 1 crore

Man held for duping over 100 women, Man held for duping women, Man held for duping over 100 women of Rs ! crore, Man duped over 100 women, Man duped over 100 women on pretext of marriage, Man duped over 100 women marriage, Farhan Khan held for duping 100 women, Farhan Khan duped over 100 women of 1 crore, Farhan Khan marriage, delhi, duping, delhi crime, odisha, karnataka, chhattisgarh, maharashtra, uttar pradesh, new delhi, gujarat, india, bihar, west bengal, Farhan Khan, marriage, Paharganj hotel, AIIMS Doctor, 13 states women, Rs 1 Crore, Delhi, Crime

A 35-year-old man, who drove around in a luxury car and stayed in luxury hotels, was arrested from a Paharganj hotel for allegedly duping over 100 women from across 13 states of nearly ₹1 crore on the pretext of marriage, with police saying that he approached the women through matrimonial sites.

పెళ్లి పేరుతో 100 మంది యువతులకు రూ. కోటి మేర టోకరా.!

Posted: 05/13/2022 09:35 PM IST
Delhi 35 year old held for duping over 100 women from 13 states of 1 crore

పెళ్లంటే నూరేళ్ల పంట. ఎవరి జీవితంలోనైనా కేవలం ఒక్కసారి మాత్రమే జరిగే మహావేడుక. అప్పటివరకు ఒకరికి ఒకరు తెలియకుండానే.. ఒక్కటై.. ఓకరికి ఒకరై.. జీవితాంతం తోడుగా ఉండే చక్కని బంధం. కష్టనష్టాలలో.. ఇష్టాయిష్టాలలో.. త్యాగనిరతిని పెనవేసుకునే బహుచక్కని బంధం. అలాంటి బంధాన్ని అందరూ అపురూపంగా కాపాడుకుంటారు. కానీ కోందరు పెళ్లి అనే బంధాన్ని కూడా మోసంతో ముడివేస్తున్నారు. పెళ్లి పేరిట 100 మంది మహిళలను మోసం చేసిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఫర్హాన్‌ ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి నుంచి ఓ బీఎండబ్ల్యూ కారు.. ఏటీఎంలు, సిమ్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

ఓ మ్యాట్రిమోనియల్‌ పోర్టల్‌లో తాను ఓ వ్యక్తిని కలిశానని తాను ఓ అవివాహితుడనని చెప్పున్న ఆ వ్యక్తి.. బిజినెస్‌ డీల్‌ పేరిట ఆమె నుంచి రూ.15లక్షలు దోపిడీ చేశాడని  ఏయిమ్స్‌కు చెందిన ఓ వైద్యురాలు సౌత్‌ ఢిల్లీ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన ఫర్హాన్‌ మ్యాట్రిమోనియల్‌ సైట్లలో ఫేక్‌ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసి.. వర్కింగ్‌ మహిళలను లక్ష్యంగా చేసుకునేవాడు. నిందితుడు చదివింది కేవలం ఇంటర్మీడియట్‌ మాత్రమేనని.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు.

తన తల్లిదండ్రులు చనిపోయారని మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లలలో పేర్కొన్న నిందితుడు.. వాటి ద్వారా అవివాహిత యువతులను లక్ష్యంగా చేసుకుని వారిని సంప్రదించి, వారితో ఎంతో కలవిడిగా, నిర్మోహమాటంగా మాట్లాడేవాడు. ఆ తర్వాత వారు తన ట్రాప్ లో పడ్డారని తెలుసుకున్న తరువాత.. వారికి ఏవో సాకులు చెప్పి.. వారి నుంచి డబ్బులు తీసుకోనే వాడు. అలాగే ఎయిమ్స్ చెందిన మహిళా వైద్యరాలిని సైతం మోసం చేయగా.. సదరు మహిళ మార్చి 26న పోలీసులకు ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. అయితే అంతకుముందు ఎందరినో మోసం చేసినా.. కోందరు తప్ప మిగతావారందరూ నిమ్మకుండిపోయారు.

అయితే వైద్యురాలి ఫిర్యాదు మేరకు డీసీపీ బెనిటా మేరి ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. 18 రోజుల పాటు బృందం కష్టపడి నిందితుడిని పట్టుకుంది. సదరు వ్యక్తి పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, ఒడిశా, కర్నాటకతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన మహిళలను మోసం చేసినట్లు పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా ఫర్హాన్‌ మహిళలను మోసం చేస్తున్నాడని చెప్పారు. తనకు వ్యాపారాలు ఉన్నాయని, ఎంబీఏ, ఇంజినీరింగ్‌ చదివినట్లు మహిళలకు చెప్పి వారిని నమ్మించే వాడని ఆ తర్వాత వారి నుంచి డబ్బులు వసూలు చేశాక వారితో సంబంధాలను కట్‌ చేసుకునేవాడని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles